ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ ఇంటిపై కోడిగుడ్లు, రాళ్లతో దాడి చేసిన బీజేపీ కార్యకర్తలు

  • Published By: bheemraj ,Published On : July 13, 2020 / 11:19 PM IST
ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ ఇంటిపై కోడిగుడ్లు, రాళ్లతో దాడి చేసిన బీజేపీ కార్యకర్తలు

వరంగల్ జిల్లాలో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ పొలిటికల్ ఫైట్ ముదురుతోంది. ఓరుగల్లులో దాడుల రాజకీయ పర్వం కొనసాగుతోంది. తాజాగా వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ ఇంటిపైకి బీజేపీ కార్యకర్తలు దాడికి దిగారు. ఆయన ఇంటిపై కోడిగుడ్లు, రాళ్లతో ఎమ్మెల్యే మెరుపు దాడి చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళకారులను అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు.

ఉమ్మడి వరంగల్ రాజకీయలన్నీ టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా మారాయి. ప్రతిచోటా పరిస్థితులన్ని ఉద్రిక్తతంగా మారుతున్నటువంటి వాతావరణం వరంగల్ జిల్లాలో వేడెక్కుతుంది. ఆదివారం నిజమాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ఎంపీ ధర్మపురి అరవింద్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, ప్రభుత్వ చీఫ్ గెస్ట్ దాస్యం వినయ్ భాస్కర్, మాజీ ఎంపీ కవితపై చేసినటువంటి తీవ్రమైన వివాదస్పద వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి.

ఈ నేపథ్యంలో తీవ్రంగా స్పందించిన టీఆర్ఎస్ కార్యకర్తలు నిన్న బీజేపీ నేత, ఎంపీ అరవింద్ ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇవాళ బీజేపీ శ్రేణులు ఉదయం దాస్యం వినయ్ భాస్కర్ ఇంటిపైన కోడిగుడ్లతో దాడి చేశారు. ఇనుముల రాకేశ్ రెడ్డి నేతృత్వంలో దాడికి పాల్పడ్డారు. దీంతో అక్కడ ఉద్రిక్తంగా మారింది.

కొద్ది సేపటి క్రితం ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ ఇంటిపై ఆరుగురు బీజేపీ కార్యకర్తలు ఒక్కసారిగా వెళ్లి కోడి గుడ్లతో దాడి చేశారు. ఉదయం నుంచి సాధారణ పరిస్థితులున్నాయనుకుని పహారకాస్తున్న పోలీసుల కళ్లు గప్పి బీజేపీ కార్యకర్తలు కోడిగుడ్లు, రాళ్లతో మెరుపు దాడి చేశారు. దీంతో ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. పోలీసులు వెంటనే తేరుకుని ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయి. టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల పరస్పర దాడులతో నగరమంతా ఉద్రిక్తంగా మారింది.

ఈ నేపథ్యంలో వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ తీవ్రంగా స్పందించారు. దాడులు తెగబడుతున్న సంస్కృతికి బీజేపీ తెరలేపుతుందన్నారు. వాస్తవాలను కప్పిపుచ్చి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి, ప్రశాంతంగా వరంగల్ లో బీజేపీ రాజకీయ చిచ్చు రేపుతోందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.