Bandi Sanjay : ప్రధానిని అప్రతిష్టపాలు చేసేందుకు పంజాబ్ ప్రభుత్వం పన్నిన కుట్ర-బండి సంజయ్

హైదరాబాద్ ఎల్బీనగర్ నియోజకవర్గం చైతన్యపురి వద్ద జరిగిన మౌనదీక్షలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాల్గోన్నారు.

Bandi Sanjay : పంజాబ్  రాష్ట్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాన్వాయ్‌ను  అడ్డుకోవటంపై బీజేపీ శ్రేణులు ఈరోజు దేశవ్యప్తంగా మౌనదీక్షలు చేపట్టి నిరసన తెలుపుతున్నాయి.  హైదరాబాద్ ఎల్బీనగర్ నియోజకవర్గం చైతన్యపురి వద్ద జరిగిన మౌనదీక్షలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాల్గోన్నారు.

ఉదయం 11 గంటలనుంచి మధ్యాహ్నం 2 గంటలవరకు అంబేద్కర్ విగ్రహం వద్ద ఆయన మౌనదీక్షలో పాల్గోంటున్నారు. మౌనదీక్షకు కూర్చోటానికి ముందు ఆయన మాట్లాడుతూ…. ప్రధానిని అప్రతిష్టపాలు చేయటానికే పంజాబ్ ప్రభుత్వం పన్నిన కుట్ర ఇది అని అన్నారు.

అత్యంతం రహస్యంగా ఉండాల్సిన ప్లాన్ బీ ఎలా లీకయ్యిందని ఆయన ప్రశ్నించారు. వ్యక్తికి భద్రత కల్పించేందుకు ఎస్పీజీ అనేక చర్చలు చేస్తుంది.  వానపడుతుంది అని వాతావరణశాఖ హెచ్చరించటంతో ప్లాన్ బీ అమలు చేశారు.  ఇది  ఎలా లీకయ్యిందనేదే ఇప్పుడు ప్రశ్న అని ఆయన అన్నారు. ప్లాన్ సీ ప్రకారం రైతుల పేరుతో కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారని ఆయన ఆరోపించారు.
Also Read : Vanama Raghava : వనమా రాఘవపై 12 కేసులు-రిమాండ్ రిపోర్ట్‌లో తెలిపిన పోలీసులు
ప్రధానిని అడ్డుకుంటే   ఎస్పీజీ  సిబ్బంది  కాల్పులు జరుపుతుంది. ఆ రకంగా ప్రధానిని అప్రతిష్టపాలు చేయాలని చూశారని బండి సంజయ్ అన్నారు. మోదీని అడ్డుకున్న ప్రదేశం పాకిస్తాన్ కు 18 కిలోమీటర్లు దూరంలో ఉందని ఆయన తెలిపారు. పంజాబ్‌లో కాంగ్రెస్ ఏమి మాట్లాడితే….తెలంగాణలో టీఆర్ఎస్ అదే మాట్లాడుతోందని…ఇలాంటి రాజకీయాలకు టీఆర్ఎస్ ఫుల్‌స్టాప్ పెట్టాలని బండి సంజయ్ సూచించారు.

ట్రెండింగ్ వార్తలు