టీఆర్ఎస్‌కు సీట్లు వచ్చినా.. ఓట్లలో బీజేపీనే టాప్

టీఆర్ఎస్‌కు సీట్లు వచ్చినా.. ఓట్లలో బీజేపీనే టాప్

ghmc elections: మొత్తం ఓట్ల పరంగా చూస్తే బీజేపీ కంటే టీఆర్ఎస్ గెలిచింది ఆరు స్థానాల ఆధిక్యత మాత్రమే. ప్రస్తుతం టీడీపీ ఒకటి కోల్పోగా టీఆర్ఎస్ 95నుంచి 55కి పడిపోయింది. కానీ, 4డివిజన్ల నుంచి 49డివిజన్లకు చేరుకుంది బీజేపీ. గ్రేటర్ పరిధిలో అతిపెద్ద పార్టీగా టీఆర్ఎస్ గెలుపొందినా ఓట్ల పరంగా బీజేపీనే గెలుపొందింది.

టీఆర్ఎస్ అభ్యర్థులు పది-పదిహేను స్థానాల్లో మాత్రమే స్వల్ప తేడాతో ఓడిపోయారు. మిగిలిన చోట్ల బీజేపీ గెలిచిన ప్రాంతాలన్నీ అధిక మెజారిటీ సాధించింది. గ్రేటర్ పరిధిలో బీజేపీనే పైచేయి సాధించినట్లని చెబుతున్నారు. ఇప్పటివరకూ బీజేపీ కంటే టీఆర్ఎస్ కే ఓటింగ్ శాతం ఎక్కువగా ఉందని చెబుతున్నారు.



ఓటింగ్ శాతం ప్రకారం చూస్తే.. రెండో ప్లేస్ లో టీఆర్ఎస్, మూడో ప్లేస్ లో ఎమ్ఐఎమ్ ఉన్నాయి. 2016ఎన్నికల్లో 33లక్షల 60వేల ఓట్లు నమోదయ్యాయి. అప్పుడు టీఆర్ఎస్ 43.85శాతం రాగా ఎంఐఎం 15.85శాతం, బీజేపీ 10.34శాతం దానితో సమానంగా కాంగ్రెస్ కు 10.40శాతం రాగా టీడీపీకి 13.11శాతం ఓట్లు దక్కించుకుంది.

అదే 2019లోక్ సభ ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలో 3 స్థానాలు ఉన్నాయి. వాటిల్లో 33లక్షల 56వేల ఓట్లు నమోదయ్యాయి. కాకపోతే అప్పుడు టీఆర్ఎస్ కు 29.15శాతం రాగా, ఎంఐఎంకు 15.40శాతం, బీజేపీ 27.50శాతంతో కాస్త వ్యత్యాసంగా 24.60మాత్రమే దక్కించుకున్నాయి. టీడీపీకి సున్నా.

2020జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 34లక్షల 73వేల ఓట్లు నమోదయ్యాయి. మళ్లీ ఎంఐఎం అదే 15శాతం ఓటింగ్ నమోదు చేసుకునే అవకాశం కనిపిస్తుంది. టీడీపీ అస్సలు పోటీ చేయకపోవడంతో అది బీజేపీకి ప్లస్ అయింది. టీఆర్ఎస్ ఓటింగ్ శాతం 40శాతం రాబోతుండగా బీజేపీ అంతకంటే కాస్త అధికంగా ఓట్ల శాతం నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.