Ponguleti Srinivas Reddy: బీజేపీలోకి ఖాయమా? పొంగులేటి ఇంటికి బీజేపీ చేరికల కమిటీ.. పసందైన విందు ..

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీజేపీకి పెద్దగా క్యాడర్ లేదు. ఆ జిల్లాలో బీజేపీ బలపడాలంటే పొంగులేటి లాంటి నాయకులు అవసరమని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు. ఆయన్ను పార్టీలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో గురువారం పొంగులేటితో బీజేపీ చేరికల కమిటీ సభ్యులు భేటీ కానున్నారు.

Ponguleti Srinivas Reddy: బీజేపీలోకి ఖాయమా? పొంగులేటి ఇంటికి బీజేపీ చేరికల కమిటీ.. పసందైన విందు ..

Ponguleti Srinivas Reddy

Ponguleti Srinivas Reddy: మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏ పార్టీలో చేరుతారనే విషయంపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లో ఏదో ఒక పార్టీలో పొంగులేటి చేరుతారని స్పష్టమైనప్పటికీ.. ఏ పార్టీలోకి వెళ్తారనేది ఆయన అభిమానులతో పాటు, రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర విషయంగా మారింది. బీఆర్ఎస్ పార్టీలో ఉంటూనే తన వర్గీయులతో ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తూ.. సీఎం కేసీఆర్ లక్ష్యంగా పొంగులేటి విమర్శలు చేస్తూ వచ్చారు. గతనెల మొదటి వారంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావులు కొత్తగూడెంలో జరిగిన ఆత్మీయ సమావేశంలో పాల్గొని సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. దీంతో ఏప్రిల్ 10న వారిద్దరిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది.

BRS Suspends Ponguleti : నన్ను సస్పెండ్ చేయటం దొంగలు పడ్డ ఆర్నెల్లకు కుక్కలు మొరిగినట్లుగా ఉంది : పొంగులేటి

బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన పొంగులేటి కాంగ్రెస్, బీజేపీ పార్టీల్లో ఏ పార్టీలో చేరుతారనేది అప్పటి నుంచి ప్రశ్నగానే మిగులుతూ వస్తోంది. ఇరు పార్టీలు పొంగులేటికి ఆహ్వానాలు పలుకుతున్నాయి. ఇప్పటికే బీజేపీ చేరికల కమిటీ పొంగులేటితో టచ్ లో ఉంటూనే వస్తుంది. గత నెలలో అమిత్ షా పర్యటన సమయంలో పొంగులేటి బీజేపీలో చేరుతారని ప్రచారం జరిగింది. ఇప్పటికే రాహుల్ గాంధీ టీం పొంగులేటితో చర్చలు జరిపింది. కాంగ్రెస్ పార్టీలోకి వస్తే పెద్దపీట వేస్తామని పొంగులేటి హామీ ఇచ్చినట్లు తెలిసింది. ఈ క్రమంలో పొంగులేటి కాంగ్రెస్ లోకి చేరుతున్నారంటూ వార్తలు వచ్చాయి. కానీ అవి కార్యరూపం దాల్చలేదు.

Ponguleti Srinivas Reddy: సర్కార్‎పై పొంగులేటి ప్రశ్నాస్త్రాలు

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీజేపీకి పెద్దగా పట్టులేదు. ఆ జిల్లాలో బీజేపీ బలపడాలంటే పొంగులేటి లాంటి నాయకులు అవసరమని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు. ఆయన్ను పార్టీలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో గురువారం పొంగులేటితో బీజేపీ చేరికల కమిటీ సభ్యులు భేటీ కానున్నారు. ఈటెల రాజేందర్ ఆధ్వర్యంలో చేరికల కమిటీ సభ్యులు కొండా విశ్వేశ్వరరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, రఘునందన్ రావు, మరికొందరు బీజేపీ నేతలు శ్రీనివాస్ రెడ్డి ఇంటికి లంచ్ మీటింగ్ కు హాజరుకానున్నారు. పొంగులేటిని బీజేపీలో చేరాలని కోరడంతోపాటు, పార్టీలో చేరితే ఎలాంటి ప్రాధాన్యత లభిస్తుందనే విషయంపై కూడా క్లారిటీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. వీరి భేటీతో పొంగులేటి ఏ పార్టీలోకి వెళ్తారనేది స్పష్టత వస్తుందని, దాదాపు ఆయన బీజేపీలోకి వెళ్లడం ఖాయంగా కనిపిస్తోందని పొంగులేటి అనుచరులు చెబుతున్నారు.

Jupally Ponguleti : వీడిన సస్పెన్స్.. కాంగ్రెస్ గూటికి పొంగులేటి, జూపల్లి

పసందైన విందు..

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసానికి బీజేపీ చేరికల కమిటీ బృందం వెళ్లనుంది. ఈ సందర్భంగా వారికి వెజ్, నాన్ వెజ్‌తో పలు రకాల వంటకాలతో పసందైన విందును ఏర్పాటు చేస్తున్నట్లు పొంగులేటి అనుచరులు పేర్కొంటున్నారు. వారికోసం చింతచిగురు పప్పు, బెండకాయ ఫ్రై, మజ్జిగ చారు, పచ్చి పులుసు, నాటుకోడి, బురద మట్టలు, మటన్, వైట్ రైస్, కుండ పెరుగు, జొన్న రొట్టెలను పొంగులేటి సిద్ధం చేయిస్తున్నారట.