Gangster Naeem : గ్యాంగ్ స్టర్ నయీం దగ్గర స్వాధీనం చేసుకున్న రూ.వేల కోట్లు..డాక్యుమెంట్లు ఏమయ్యాయి : బండి సంజయ్

గ్యాంగ్ స్టర్ నయీంకు చెందిన వేలకోట్ల రూపాయలు..స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్లు ఏమయ్యాయి? అని బీజేపీ నేత బండి సంజయ్ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నిలదీశారు. నయీం డైరీలో ఏముంది? అనే విషయాలన్ని ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు.

Gangster Naeem : గ్యాంగ్ స్టర్ నయీం దగ్గర స్వాధీనం చేసుకున్న రూ.వేల కోట్లు..డాక్యుమెంట్లు ఏమయ్యాయి : బండి సంజయ్
ad

Gangster Naeem diary : గ్యాంగ్ స్టర్ నయీంకు చెందిన వేలకోట్ల రూపాయలు..స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్లు ఏమయ్యాయి? అని బీజేపీ నేత బండి సంజయ్ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నిలదీశారు. నయీం డైరీలో ఏముంది? అనే విషయాలన్ని ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మూడవ విడత ప్రజా సంగ్రామ యాత్ర యాదాద్రి వేదికగా ప్రారంభమైంది. పాదయాత్ర ప్రారంభం సందర్భంగా యాదగిరి గుట్టలో బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభలో ప్రసంగించిన రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. సీఎం కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు.

భూ కబ్జాలు,కేసీనో వంటి వ్యవహారాల్లో టీఆర్ఎస్ నేతలు ఎక్కువగా ఉంటున్నారని రాజకీయ పదవుల్ని అడ్డు పెట్టుకుని టీఆర్ఎస్ నేతలు చేసే అరాచకాలను తాము అధికారంలోకి వచ్చాక బయటపెడతామని బండి సంజయ్ అన్నారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందని..కనీసం ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదని..ఒకటో తేదీన ఉద్యోగులకు జీతాలు ఎందుకు ఇవ్వటంలేదు? దీనికి సీఎం కేసీఆర్ సమాధానం చెప్పాలంటూ డిమాండ్ చేశారు.

రాష్ట్రం అంతా వరదలతో అల్లాపోతున్న సమయంలో ఇక్కడి సమస్యలు వదిలేసి సీఎం కేసీఆర్ ఢిల్లీకి ఎందుకు వెళ్లారో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రతి కార్యకర్త ఉగ్రనరసింహస్వామి అవతారం ఎత్తి.. టీఆర్ఎస్ రాక్షస పాలనను అంతం చేయాలని పిలుపునిచ్చారు బండి సంజయ్. ప్రజా సంగ్రామ యాత్రతో సీఎం భయపడుతున్నారని అన్నారు. నల్గొండలో బీజేపీ ఎక్కడ ఉందని చాలా మంది మాట్లాడారని..ఖమ్మం జిల్లాలోనూ బీజేపీ బలం ఏంటో చూపిస్తామని అన్నారు.