Telangana : నిజామాబాద్‌లో కవిత ఓడిపోయేలా ప్లాన్ చేసింది కేసీఆరే : బూర నర్సయ్య గౌడ్ సంచలన వ్యాఖ్యలు

నిజామాబాద్‌లో కవితను ఓడిపోయేలా ప్లాన్ చేసింది కేసీఆరే.. తన రాజకీయాల కోసం కేసీఆర్ పక్కా ప్లాన్ ప్రకారమే తన కూతురు కవితి ఎన్నికల్లో ఓడిపోయేలా చేశారు అంటూ మాజీ ఎంపీ నర్సయ్య గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Telangana : నిజామాబాద్‌లో కవిత ఓడిపోయేలా ప్లాన్ చేసింది కేసీఆరే : బూర నర్సయ్య గౌడ్ సంచలన వ్యాఖ్యలు

BJP leader Boora Narsaiah Goud's sensational allegations against CM KCR

Telangana : బీజేపీలో చేరాలని కవితపై ఒత్తిడి తెచ్చారు అంటూ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ కౌంటర్ ఇచ్చారు. తన రాజకీయాల కోసం కూతురు కవిత రాజకీయ జీవితాన్ని కూడా కేసీఆర్ పణ్ణం పెట్టారని నిజాబాద్ ఎన్నికల్లో కవిత ఓటమికి కేసీఆరే కారణం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు బూర నర్సయ్య గౌడ్. రాజకీయాల కోసం కూతురు కవిత పేరును వాడుకోవటం కేసీఆర్ కే చెల్లింది అంటూ ఎద్దేవా చేశారు. మరో పవర్ సెంటర్ కాకూడదని కూతరు అని కూడా చూడకుండా నిజామాబాద్ లో కవిత ఓడిపోవటానికి గులాబీ బాస్ పక్కా ప్లాన్ ప్రకారమే కవిత ఓడిపోయేలా చేశారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కవిత ఓటవి వెనుక కేసీఆర్ హస్తం ఉందని పక్కా ప్లాన్ ప్రకారమే కవిత ఓడిపోయేలా కేసీఆర్ చేశారంటూ వ్యాఖ్యానించారు బూర నర్సయ్య గౌడ్.

CM KCR On BJP : బీజేపీలో చేరాలని కవితపై ఒత్తిడి తెచ్చారు, జగన్‌ని దెబ్బకొట్టేందుకు కుట్రలు చేస్తున్నారు-సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

బీజేపీలో చేరాలని కవితపై ఒత్తిడి తెచ్చారు అంటూ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను కూడా బూర ఎద్దేవా చేశారు. కవితే కాదు సాక్షాత్తు టీఆర్ఎస్ పార్టీనే బీజేపీలో విలీనం చేస్తామన్నా ఒప్పుకోం అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమి ఖాయం అంటూ జోస్యం చెప్పిన బూర నర్సయ్య వచ్చే ఎన్నికల్లో 90 శాతం టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఓడిపోతారు అంటూ చెప్పుకొచ్చారు.

కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ అనేది పెద్ద సమస్యకాదని చెప్పుకొచ్చిన బూర నర్సయ్య తెలంగాణాలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీలు సహా ఎవరైనా సీఎం కావొచ్చని అన్నారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ కు బీసీలు రాజకీయ సమాధి కట్టటం ఖాయం అంటూ టీఆర్ఎస్ పైనా..కేసీఆర్ పైనా సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్.

CM KCR Warning : మీకు భవిష్యత్తు ఉండదు.. టీఆర్ఎస్ నేతలకు కేసీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్

కాగా..టీఆర్ఎస్ కు రాజీనామా చేసిన బూర నర్సయ్య టీఆర్ఎస్ పాలనలో బీసీలను వివక్షకు గురి చేస్తున్నారంటూ తీవ్ర అసంతృప్తి వెళ్లగక్కారు. అభిమానానికి బానిసత్వానికి చాలా తేడా ఉందని తన ఆత్మాభిమానం దెబ్బతినేలా వ్యవహరించారని అందుకే టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు.