Etala Rajender : కేసీఆర్ ఎప్పుడైనా ట్యాంక్ బండ్ పై అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారా ?

మాజీమంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ సీఎం కేసీఆర్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేసీఆర్ ఎప్పుడు ఎవరికి పట్టం కడతారో జనం అర్థం చేసుకోవాలన్నారు.

Etala Rajender : కేసీఆర్ ఎప్పుడైనా ట్యాంక్ బండ్ పై అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారా ?

Itala Rajender

Etala Rajender criticized KCR : మాజీమంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ సీఎం కేసీఆర్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అనంతరం ఈటల మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ ఎప్పుడు ఎవరికి పట్టం కడతారో జనం అర్థం చేసుకోవాలన్నారు. గతంలో తనను బొందపెట్టాలని చూసిన వారిని ఇప్పుడు ఆదరిస్తున్నారని ఇది ప్రజాస్వామ్యానికి మచ్చ అని పేర్కొన్నారు. కేసీఆర్ కు హుజూరాబాద్ ప్రజల మీద కంటే వారి ఓట్ల మీదే ప్రేమ ఎక్కువన్నారు. హుజూరాబాద్ ఎన్నిక రాగానే పెన్షన్ లకు రెక్కలొచ్చాయని పేర్కొన్నారు. హుజూరాబాద్ లో గొల్ల, కురుమల ఓట్లు కొల్లగొట్టేందుకు బెనిఫిషరీ కాంట్రిబ్యూషన్ కూడా కడుతున్నారని పేర్కొన్నారు.

కేసీఆర్ ఎప్పుడైనా ట్యాంక్ బండ్ పై అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారా అని ప్రశ్నించారు. ఏడు సంవత్సరాల కాలంలో ఒక్కరోజు కూడా ట్యాంక్ బండ్ పైనున్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేయని కేసీఆర్…దళితులను గౌరవించే పద్ధతి ఇదేనా అని ప్రశ్నించారు. ఏడేళ్లలో సీఎం ఆఫీస్ లో ఒక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అధికారి నియామకం జరగలేదన్నారు. దళితులకు మూడు ఎకరాల భూమి ఎక్కడ కూడా అములు కాలేదని చెప్పారు. దళితుల జీవితాల్లో వెలుగు నింపలేదని విమర్శించారు.

దళిత ముఖ్యమంత్రి దేవుడెరుగు..దళిత ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి కూడా మార్చేసిన చరిత్ర కేసీఆర్ దని మండిపడ్డారు. హూజూరాబాద్ నియోజకర ప్రజలకే కాకుండా యావత్తు తెలంగాణ రాష్ట్రంలోని దళిత కుటుంబాలకు దళిత బంధు పథకం కింద రూ.10 లక్షల చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏడేళ్ల కాలంలో ఎన్నడు కూడా కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదని విమర్శించారు.