BJP leader Laxman: ప్రధాని ముందు ముఖం చెల్లకనే కేసీఆర్ రాష్ట్రం విడిచిపోతున్నడు |BJP leader Laxman criticizes CM KCR

BJP leader Laxman: ప్రధాని ముందు ముఖం చెల్లకనే కేసీఆర్ రాష్ట్రం విడిచిపోతున్నడు

ప్రధాని నరేంద్ర మోదీ రేపు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కు వస్తున్నారని, ప్రధాని ముందు ముఖం చెల్లకనే సీఎం కేసీఆర్ రాష్ట్రం విడిచిపోతున్నాడని బీజేపీ సీనియర్ నేత లక్ష్మణ్ విమర్శించారు. 26న మధ్యాహ్నం ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ రానున్నారు. ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎస్‌బీ) 20వ స్నాతకోత్సవంలో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. మధ్యాహ్నం బేగంపేట ఎయిర్ పోర్ట్ కు మోదీ చేరుకోనున్నారు...

BJP leader Laxman: ప్రధాని ముందు ముఖం చెల్లకనే కేసీఆర్ రాష్ట్రం విడిచిపోతున్నడు

BJP leader Laxman: ప్రధాని నరేంద్ర మోదీ రేపు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కు వస్తున్నారని, ప్రధాని ముందు ముఖం చెల్లకనే సీఎం కేసీఆర్ రాష్ట్రం విడిచిపోతున్నాడని బీజేపీ సీనియర్ నేత లక్ష్మణ్ విమర్శించారు. 26న మధ్యాహ్నం ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ రానున్నారు. ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎస్‌బీ) 20వ స్నాతకోత్సవంలో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. మధ్యాహ్నం బేగంపేట ఎయిర్ పోర్ట్ కు మోదీ చేరుకోనున్నారు. ఈ సందర్భంగా బీజేపీ ముఖ్యనేతలతో ప్రధాని కొద్ది సేపు మాట్లాడతారని తెలుస్తోంది. ఈ క్రమంలో బుధవారం బేగంపేట ఎయిర్ పోర్టులో ఏర్పాట్లను బీజేపీ సీనియర్ నేత లక్ష్మణ్ నేతృత్వంలోని బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రానికి ప్రధాని నరేంద్ర మోదీ వస్తుంటే రాష్ట్ర సీఎం కేసీఆర్ మాత్రం ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నాడని విమర్శించారు.

PM Modi: రేపు హైదరాబాద్‌కు ప్రధాని మోదీ రాక.. స్వాగతం పలకనున్న..

ప్రధాని ముందు ముఖం చెల్లకనే సీఎం కేసీఆర్ రాష్ట్ర విడిచిపోతున్నాడని లక్ష్మణ్ ఆరోపించారు. సంప్రదాయాలను పాటించకుండా కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నాడని విమర్శించారు. కేసీఆర్ చర్యలు తెలంగాణ సమాజం అసహయించుకుంటోందని అన్నారు. ఎయిర్ పోర్టులో పార్టీ తరుపున ప్రధానికి సన్మాన కార్యక్రమం ఉంటుందని, ఎయిర్ పోర్టులో ప్రధాని మోదీ ప్రసంగించే అవకాశం లేదని లక్ష్మణ్ తెలిపారు. మాట్లాడితే అంతకంటే సంతోషం మరొకటి లేదని అన్నారు. మోదీకి ఘనస్వాగతం పలికేందుకు ఎయిర్ పోర్టుకు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు వస్తున్నారని తెలిపారు. ప్రధానిని ముఖ్యమంత్రి స్వాగతం పలికే ఆనవాయితీని కేసీఆర్ కాలరాశాడని విమర్శించారు. సొంత రైతులను వదిలేసి, ఇతర రాష్ట్ర రైతులకు డబ్బులు ఇస్తున్న ఘనత కేసీఆర్ కే దక్కుతుందని లక్ష్మన్ ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజల ఆదాయాన్ని ఇతర ప్రాంతాల వారికి సీఎం కేసీఆర్ దారాదత్తం చేస్తున్నాడని విమర్శించారు.

PM Modi in Japan: ప్రపంచానికి దిక్సూచిగా భారత్: క్వాడ్ లీడర్ల ముందు వరుసలో ప్రధాని మోదీ

ప్రధాని మోదీ రాకతో బీజేపీ క్యాడర్ లో నూతన ఉత్సాహం వస్తోందన్నారు. తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు గెలుపొందటం ఖాయమని లక్ష్మణ్ జోస్యం చెప్పారు. కేంద్రంలో, రాష్ట్రంలో ఒకే పార్టీ అధికారంలో ఉంటే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివఋద్ధి సాధిస్తుందని తెలిపారు.

×