Muralidhar Rao : దమ్ముంటే.. బీజేపీ సహా డ్రగ్స్‌తో ప్రమేయం ఉన్నవారిని అరెస్ట్ చేయండి-మురళీధర్ రావు

తెలంగాణ ప్రభుత్వానికి దమ్ముంటే బీజేపీ సహా డ్రగ్స్ తో ప్రమేయమున్న వారిపై కేసులు పెట్టి లోపల వేయాలని అన్నారు. హైదరాబాద్ లో డ్రగ్స్ కల్చర్ పాపం..(Muralidhar Rao)

Muralidhar Rao : దమ్ముంటే.. బీజేపీ సహా డ్రగ్స్‌తో ప్రమేయం ఉన్నవారిని అరెస్ట్ చేయండి-మురళీధర్ రావు

Muralidhar Rao

Muralidhar Rao : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన హైదరాబాద్ డ్రగ్స్ కేసుపై బీజేపీ సీనియర్ నేత మురళీధర్ రావు హాట్ కామెంట్స్ చేశారు. తెలంగాణ ప్రభుత్వానికి దమ్ముంటే బీజేపీ సహా డ్రగ్స్ తో ప్రమేయమున్న వారిపై కేసులు పెట్టి లోపల వేయాలని ఆయన సవాల్ విసిరారు. హైదరాబాద్ లో డ్రగ్స్ కల్చర్ పాపం.. టీఆర్ఎస్ నాయకత్వానిదే అని మురళీధర్ రావు ఆరోపించారు.

ఫిలిం ఇండస్ట్రీ సహా డ్రగ్స్ కేసుల్లో బయటకు వచ్చింది చాలా తక్కువ అని చెప్పారు. టీఆర్ఎస్ నేతలకు డ్రగ్ మాఫియాతో పూర్తి సంబంధాలున్నాయని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. టీఆర్ఎస్ మద్దతు లేకుండా గంట కూడా డ్రగ్ మాఫియా హైదరాబాద్ లో ఉండలేదన్నారు. టీఆర్ఎస్ హయాంలోనే హైదరాబాద్ లో డ్రగ్ కల్చర్ పెరిగిందని ఆరోపించారు. టీఆర్ఎస్ కు డ్రగ్స్ ముఠాలతో ఉన్న లింక్స్ అన్నీ బయటకు వస్తాయని అన్నారు. డ్రగ్స్ ను నియంత్రించే పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే అని తేల్చి చెప్పారు. పంజాబ్ రాజకీయాల్లో మార్పునకు కారణం డ్రగ్ మాఫియా అని మురళీధర్ రావు అన్నారు.(Muralidhar Rao)

హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ మహమ్మారి కలకలం రేపింది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 6లో ఉన్న రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్ లోని పుడ్డింగ్ అండ్ మింక్ పబ్ లో ఆదివారం తెల్లవారుజామున నార్త్ జోన్ టాస్ ఫోర్స్ పోలీసులు జరిపిన దాడుల్లో డ్రగ్స్ పార్టీ గుట్టు రట్టయింది. మద్యం, డ్రగ్స్ సేవిస్తూ యువతీ యువకులు చిక్కారని పోలీసులు తెలిపారు. డ్రగ్స్ పార్టీలో పాల్గొన్న వాళ్లలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పిల్లలు, రాజకీయ ప్రముఖుల పిల్లు ఉండటం సంచలనం రేపింది. ఈ దాడుల్లో పోలీసులు డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. పబ్ సిబ్బంది సహా 148 మందిని అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం వారందరిని వదిలేశారు. కాగా, పబ్ లో డ్రగ్స్ వినియోగం వ్యవహారాన్ని పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు.(Muralidhar Rao)

Pudding Mink Pub : డ్రగ్స్ అమ్మేది మీరే.. ప‌బ్‌లో ప‌ట్టుబ‌డిన వారంతా బీజేపీ, కాంగ్రెస్ నేతల పిల్ల‌లే- బాల్క సుమన్

రాడిసన్ బ్లూ పబ్ లో డ్రగ్స్ వాడకంపై సెలబ్రిటీలు, బడాబాబుల పిల్లలకు పోలీసులు నోటీసులిచ్చారు. అదే సమయంలో ఈ కేసు పోలీసుల మెడకు కూడా చుట్టుకుంది. డ్రగ్స్ సరఫరాను అడ్డుకోలేకపోయిన కారణంగా అధికారులపై స్పెన్షన్ వేటు వేశారు. కాగా, సెలబ్రిటీల పిల్లలను కాపాడేందుకే కేసును తప్పుదోవ పట్టిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. డ్రగ్స్ సూత్రధారులను ఎక్ కౌంటర్ చేయాలనే డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.

డ్రగ్స్ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. దీని వెనుకు ఉన్నది మీరంటే మీరే అంటూ అధికార, ప్రతిపక్షాలు ఒకరిపై మరొకరు ఆరోపణలు గుప్పించుకుంటున్నారు. సీఎం కేసీఆర్‎కు చిత్తశుద్ధి ఉంటే డ్రగ్స్ కేసులో పూర్తిస్థాయి విచారణ జరిపించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. రెండు రోజులు హడావుడి చేసి కేసును వదిలేయొద్దన్నారు. డ్రగ్స్ కొనేవారిని, అమ్మేవారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అవసరమనుకుంటే డ్రగ్స్ అమ్మేవారిని ఎన్‎కౌంటర్ చేయాలన్నారు. ఈ విషయంలో కేసీఆర్‎కు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చెప్పారు.

Pudding and Mink: ఫుడింగ్‌ అండ్‌ మింక్‌ పబ్‌ కేసు: డ్రగ్స్ వాడిన వారిని గుర్తించేపనిలో పోలీసులు

బీజేపీ, కాంగ్రెస్ ఆరోపణలపై టీఆర్ఎస్ నేతలు ఘాటుగా బదులిచ్చారు. డ్రగ్స్ అమ్మేది మీరే అంటూ ఎదురుదాడికి దిగారు. పబ్ లో పట్టుబడిన వారంతా బీజేపీ, కాంగ్రెస్ నేతల పిల్లలే అని టీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. పుడ్డింగ్ అండ్ మింక్ పబ్ నిర్వాహకుడు అభిషేక్ ఉప్పల బీజేపీ నేత కొడుకే అని ఆరోపించారు.