Telangana : వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీదే అధికారం

అప్పుడున్న పరిస్థితులు ఇప్పుడు లేవు..బీజెపి పార్టీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు బీజేపీ నేత రేవూరి ప్రకాష్ రెడ్డి.

Telangana : వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీదే అధికారం

Revuri

Revuri Prakash Reddy : ధాన్యం కొట్లాట నడుస్తోంది. అధికారంలో ఉన్న టీఆర్ఎస్, ప్రతిపక్ష పార్టీ బీజేపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. స్వయంగా సీఎం కేసీఆర్ రంగంలోకి దిగి…కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర బీజేపీపై విమర్శలు గుప్పించారు. దీనికి ప్రతిగా బీజేపీ నేతలు స్పందిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ…బీజేపీ ధర్నాలు నిర్వహించగా..మరుసటి రోజు కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగడుతూ..టీఆర్ఎస్ శాంతియుత ధర్నాలు చేసింది. ఈ క్రమంలో..టీఆర్ఎస్ నేతలు విమర్శలు చేశారు. దీనికి బీజేపీ నేత రేవూరి ప్రకాష్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. 2021, నవంబర్ 13వ తేదీ శనివారం హన్మకొండలో మీడియాతో మాట్లాడారు.

Read More : Spelling Mistake : చిన్న అక్షర దోషానికి రెండున్నరేళ్ల జైలు శిక్ష

ధర్నా చేస్తే నిజమైన రైతులు ఎవరు రాలేదని, డబ్బులు ఇచ్చి తీసుకోచ్చారని విమర్శించారు. 8 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు అనావృష్టి వస్తే ఆదుకున్నారా ? ముక్కలను ఎంత వరకు కొన్నారని సూటిగా ప్రశ్నించారు. 2018 మహా కూటమి పొత్తులో ఆశించిన విదంగా లేకపోవడంలో భాగంగా టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, అప్పుడున్న పరిస్థితులు ఇప్పుడు లేవు..బీజెపి పార్టీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 2021 బాయిల్డ్ రైస్ ను FCI తీసుకోదని అప్పుడు చెప్పారని, ప్రజలకు సన్నబియ్యం ఇవ్వాలని బాయిల్డ్ రైస్ తీసుకోదని చెప్పారనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

Read More : T20 : బ్యాట్‌తో చేతుపై కొట్టుకున్నాడు..ఫైనల్ మ్యాచ్‌కు దూరం

యాసంగి వడ్లు కొనమని ఎక్కడ చెప్పారో చూపించాలని, రైతులు దొడ్డు వడ్లు పండిస్తే కొనండి…రైతులను అదుకుంటే తప్పేముందన్నారు. రైతులు పండించిన పంటలకు కొనుగోలు చేస్తామని సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్ వెల్లడించారని, అంతేగాకుండా…రైతులు పండించిన ప్రతి గింజను కొంటామని అసెంబ్లీ సాక్షిగా చెప్పారన్నారు. రైతులు దొడ్డు బియ్యం వేయకండి..సన్నబియ్యం వేయమని చెప్పారని, రైతులు నష్టపోతే ఆదుకున్న పాపనపోలేదని విమర్శించారు. రైతులు పండించిన పంటలను రాష్ట్ర ప్రభుత్వం కొంటుందని అనేక మార్లు చెప్పారని, ధాన్యాన్ని FCI కొంటుందని తెలియదా ? అని ప్రశ్నించారాయన. రైతులకు 100 శాతం కేంద్రం ట్రాక్టర్ సబ్సిడీ ఇస్తే టీఆర్ఎస్ కార్యకర్తలకు ఇచ్చి రైతులను మోసం చేసిందని ఆరోపించారు. రైతులకు ఉచితంగా ఎరువులు అందిస్తామని చెప్పారు…ఏమైంది ? అన్ని ప్రశ్నించారు రేవూరి.