BJP Bull Cart : అయ్యయ్యో… బెదిరిన ఎద్దులు, బీజేపీ నేతలకు గాయాలు

పెట్రోల్, డీజిల్ పై రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ తగ్గించాలని డిమాండ్ చేస్తూ సిరిసిల్లలో బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన ఎండ్ల బండి నిరసనలో అపశ్రుతి చోటు చేసుకుంది. నిరసనలో భాగంగా ఎడ్లబండిని

10TV Telugu News

BJP Bull Cart : పెట్రోల్, డీజిల్ పై రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ తగ్గించాలని డిమాండ్ చేస్తూ సిరిసిల్లలో బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన ఎండ్ల బండి నిరసనలో అపశ్రుతి చోటు చేసుకుంది. నిరసనలో భాగంగా బీజేపీ నేతలు ఎడ్ల బండిని తీసుకురాగా, ఎద్దులు ఒక్కసారిగా బెదిరి, పరుగులు తీశాయి. బండిని లాక్కెళ్లాయి. ఈ ఘటనలో బీజేపీ నేతలు కిందపడ్డారు. వారికి స్పల్ప గాయాలు అయ్యాయి.

పలువురు బీజేపీ నేతలు, కార్యకర్తలు ఎడ్లబండిని ఎక్కారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కొంతదూరం వెళ్లారు. ఆర్డీవో కార్యాలయం నుంచి తహశీల్దార్ కార్యాలయం వైపు వస్తుండగా కార్యకర్తలు పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఈ క్రమంలో ఎడ్లు బెదిరాయి. అంతే, బండిని ఒక్కసారిగా వేగంగా లాక్కెళ్ళాయి.

Indians : గూగుల్ నుంచి ట్విట్టర్ వరకు అంతా మనోళ్లే..!

దీంతో బండి మీదున్న నేతలు పట్టు తప్పి కిందకు పడ్డారు. ఈ ఘటనలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు అన్నల్ దాస్ వేణు, కార్యకర్తలు స్వల్పంగా గాయపడ్డారు. అసలేం జరుగుతుందో తెలియక కాసేపు అంతా ఆందోళనకు గురయ్యారు. బండితో సహా పరుగులు పెట్టిన ఎడ్లు చివరికి టౌన్ క్లబ్ వెనుక వైపు బండిని వదిలి వెళ్లాయి. ఈ ఘటనలో ఓ వాహనదారుడు కూడా గాయపడ్డాడు. రోడ్డుపై ఎద్దులు వేగంగా పరుగులు తీయడంతో అంతా బిత్తరపోయారు.

×