BJP MLA Raghunandan Rao: అసెంబ్లీలో కేంద్రంపై విమర్శలు చేయడం కాదు.. మీ ఎంపీలను పార్లమెంట్‌లో మాట్లాడమనండి ..

ఒక్క తెలంగాణ ఐపీఎస్ కూడా సీఎం కేసీఆర్‌కు పనికి రావట్లేదని, అందరు బీహార్ వాళ్ళు, నార్త్ ఇండియా వాళ్ళు పని చేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన పోలీస్ అధికారులు ఇప్పుడు ఎందుకు మీకు పనికి రావట్లేదని కేసీఆర్‌ను ఆయన ప్రశ్నించారు.

BJP MLA Raghunandan Rao: 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌ను సోమవారం అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు ప్రవేశపెట్టారు. రూ. 2,90,396 కోట్లతో బడ్జెట్‌ను సభ ముందు ఉంచారు. బడ్జెట్‌లో ఆయా రంగాల కేటాయింపుల పట్ల బీజేపీ ఎమ్మెల్యే రఘునంద్‌రావు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన 10టీవీతో మాట్లాడుతూ.. త్వరలో రాష్ట్రంలో జరిగే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ప్రజలను మభ్యపెడుతూ.. మసిపూసి మారేడుకాయ చేసినట్లుగా బడ్జెట్ ఉందని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వంపై రోజురోజుకు గ్రామీణ ప్రాంతాల ప్రజల్లో, రైతన్నల్లో అసంతృప్తి, ఆగ్రహావేశాలు పెరుగుతున్నాయని అన్నారు. అసెంబ్లీలో కేంద్రంపై విమర్శలు చేయడం కాదని, బీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంటులో మాట్లాడాలని సూచించారు. కేంద్రాన్ని విమర్శించే ముందు గజ్వేల్‍‌, సిద్ధిపేట, సిరిసిల్లకు ఏం చేస్తున్నం, మిగతా 116 మంది ఎమ్మెల్యేలకు ఏం చేస్తున్నామో ముందు చెప్పాలని అన్నారు.

MLA Raghunandan Rao : రాష్ట్ర పోలీస్ శాఖలో కీలక స్థానాల్లో ఏపీ క్యాడర్.. తెలంగాణ వారికి అన్యాయం : ఎమ్మెల్యే రఘునందన్ రావు

నీతి ఆయోగ్ ఏంటో తెలుసా అంటూ రఘునందన్ ప్రశ్నించారు. నీతి ఆయోగ్ చెపితే ప్రధానమంత్రి వినాలా..? నీతి అయోగ్ కేవలం రికమండేషన్ చేసే ఏజెన్సీ మాత్రమే అని రఘునందన్ రావు అన్నారు. కేంద్రంలో ఉండే బీఆర్ఎస్ ఎంపీలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. కేంద్రం ఇచ్చే నిధుల గురించి అసెంబ్లీలో ప్రస్తావిస్తే ఏమొస్తుంది, ఎక్కడ అడగాలో అక్కడ అడగండి అంటూ రఘునందన్ సూచించారు. కేంద్ర ప్రభుత్వంకూడా బడ్జెట్ ప్రవేశపెట్టిందని, మీకు ఏదైనా సమస్య ఉంటే పార్లమెంట్ సమావేశాల్లో ప్రశ్నించాలని, అక్కడ ప్రశ్నించకుండా ఇక్కడ కేంద్రంపై అక్కస్సు వెల్లగక్కడం సరైంది కాదన్నారు. ధరణిలో జరుగుతున్న అవకతవకతలను వెంటనే పరిష్కరించాలని, 25లక్షల మంది రైతులు ఇబ్బందులు పడుతున్నారని ముగ్గురు మంత్రుల కమిటీ రికమండేషన్స్ ఇప్పటివరకు ఏం చేశారని ప్రభుత్వాన్ని రఘునందన్ రావు ప్రశ్నించారు.

Bjp MLA Raghunandan Rao: టీఆర్ఎస్ తానా అంటే కాంగ్రెస్ తందానా అంటోంది : బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్

ఎమ్మెల్యే కొనుగోలు అంశం విషయంలో గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు హైకోర్టు సమర్ధించిందని, కానీ, హైకోర్టు తీర్పును వ్యతిరేకించడం తప్ప బీఆర్ఎస్ నేతలు ఏం చేస్తారంటూ ఎద్దేవా చేశారు. పోలీసులు చేత తప్పులు చేపించారని, డబ్బుల సంచులు దొరికాయని టీవీల్లో చూడటం జరిగిందని, మాట్లాడిన వాళ్ళు ఎవరు..? పైసలు తీసుకున్న సంచులు ఎవరివి..? ఎర్ర కారు ఎవరిది..? తేలాల్సిన అవసరం ఉందని అన్నారు. ఒక్క తెలంగాణ ఐపీఎస్ కూడా సీఎం కేసీఆర్‌కు పనికి రావట్లేదని, అందరు బీహార్ వాళ్ళు, నార్త్ ఇండియా వాళ్ళు పని చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన పోలీస్ అధికారులు ఇప్పుడు ఎందుకు మీకు పనికి రావట్లేదని కేసీఆర్ ను రఘునందన్ ప్రశ్నించారు. ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో సీబీఐ ఎంక్వయిరీ జరిగితే వచ్చే నష్టమేంటని, సుప్రీంకోర్టు కాకపోతే అంతర్జాతీయ న్యాయస్థానానికి సైతం వెళ్లినా, ఇక్కడ ఎలాంటి తీర్పు వచ్చిందో అక్కడ కూడా అలాంటి తీర్పే వస్తుందని రఘునందన్ అన్నారు.

ట్రెండింగ్ వార్తలు