MLA Raja Singh: బీజేపీకో న్యాయం, టీఆర్ఎస్కో న్యాయమా: బ్యానర్ల ఏర్పాటుపై ఎమ్మెల్యే రాజాసింగ్ ఆగ్రహం

నగరంలో రాజకీయ పార్టీల ఫ్లెక్సీలు బ్యానర్లు పెడితే వెంటనే తొలగిస్తామని కేటీఆర్ అన్నారని, దీనిపై జీవోను కూడా విడుదల చేశారని రాజా సింగ్ పేర్కొన్నారు

MLA Raja Singh: బీజేపీకో న్యాయం, టీఆర్ఎస్కో న్యాయమా: బ్యానర్ల ఏర్పాటుపై ఎమ్మెల్యే రాజాసింగ్ ఆగ్రహం

Rajasingh

MLA Raja Singh: హైదరాబాద్ నగరంలో రాజకీయ పార్టీల బ్యానర్ల ఏర్పాటుపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. రహదారిపై అడ్డంగా భారీ కట్ అవుట్లు, పెద్ద పెద్ద బ్యానర్లు ఏర్పాటు చేయడంపై నగర వాసులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. టీఆర్ఎస్ పార్టీ ప్లినరీ సంధర్భంగా మంగళవారం హైదరాబాద్ నగరంలో పెద్ద ఎత్తున బ్యానర్లు, కట్ అవుట్లు ఏర్పాటు చేశారు నేతలు. దీంతో పలు చోట్ల ప్రజలు ఇబ్బంది పడ్డారు. టీఆర్ఎస్ పార్టీ బ్యానర్ల ఏర్పాటు పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మంగళవారం స్పందిస్తూ అధికార టీఆర్ఎస్ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలో రాజకీయ పార్టీల ఫ్లెక్సీలు బ్యానర్లు పెడితే వెంటనే తొలగిస్తామని కేటీఆర్ అన్నారని, దీనిపై జీవోను కూడా విడుదల చేశారని రాజా సింగ్ పేర్కొన్నారు. అయితే ఈ జీఓకు విరుద్ధంగా నేడు టీఆర్ఎస్ పార్టీ నేతలు భారీ కట్ అవుట్లు పెట్టారని..బహుశా ఈ జీవో బీజేపీకి ఇతర పార్టీలకు మాత్రమే వర్తిస్తుంది కావచ్చు? టీఆర్ఎస్ పార్టీకి వర్తించదు అనుకుంటా! అంటూ తీవ్ర విమర్శలు చేశారు రాజాసింగ్.

Also read:Group-1 notification: తెలంగాణలో గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల

నగరంలో టిఆర్ఎస్ పార్టీ బ్యానర్లు పెట్టినప్పుడల్లా జిహెచ్ఎంసి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ విశ్వజిత్..సెలవు పై వెళ్తున్నారని..గతంలో కూడా ఇదే మాదిరిగా టీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ నగరంలో బ్యానర్లు కటౌట్లు పెట్టినప్పుడు విశ్వజిత్ సెలవుపై వెళ్లారని..బీజేపీ ప్రశ్నిస్తుందనే ఆయన అలా వెళ్ళిపోతున్నారంటూ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యానించారు. గతంలో భాగ్యనగరం పరిధిలో బీజేపీ కార్యకర్తలు బ్యానర్లు పెడితే తొలగించారని అంటే టిఆర్ఎస్ పార్టీకి ఒక న్యాయం బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు ఒక న్యాయమా? అంటూ రాజాసింగ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మంగళవారం రాత్రిలోగా టీఆర్ఎస్ పార్టీకి చెందిన బ్యానర్లను జిహెచ్ఎంసి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తొలగించాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు. నేడు టీఆర్ఎస్ పార్టీ బ్యానర్లను తొలగించని పక్షంలో రానున్న రోజుల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీ పెట్టె బ్యానర్లను కూడా జిహెచ్ఎంసి అధికారులు తొలగించకూడదని రాజాసింగ్ అన్నారు.

Also read:Revanth Reddy On Puvvada Ajay : కమ్మ కులం నుంచి పువ్వాడను బహిష్కరించాలి-రేవంత్ రెడ్డి