Rajasingh’s Wife Meet Governor : గవర్నర్‌ తమిళిసైని కలిసిన ఎమ్మెల్యే రాజాసింగ్‌ భార్య

తెలంగాణ గవర్నర్‌ తమిళిసైని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ భార్య ఉషా బాయ్ కలిశారు. రాజాసింగ్‌పై అక్రమంగా పీడీ యాక్ట్‌ పెట్టారని ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం ఓ వర్గాన్ని సంతృప్తిపర్చేలా పని చేస్తోందని.. దాన్ని తన భర్త తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని ఉషా బాయ్ చెప్పారు. అందుకే తన భర్తపై అక్రమంగా కేసులు పెట్టారని గవర్నర్‌కు కంప్లైంట్‌ ఇచ్చారు.

Rajasingh’s Wife Meet Governor : గవర్నర్‌ తమిళిసైని కలిసిన ఎమ్మెల్యే రాజాసింగ్‌ భార్య

Rajasingh's Wife Meet Governor

Rajasingh’s Wife Meet Governor : తెలంగాణ గవర్నర్‌ తమిళిసైని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ భార్య ఉషా బాయ్ కలిశారు. రాజాసింగ్‌పై అక్రమంగా పీడీ యాక్ట్‌ పెట్టారని ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం ఓ వర్గాన్ని సంతృప్తిపర్చేలా పని చేస్తోందని.. దాన్ని తన భర్త తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని ఉషా బాయ్ చెప్పారు. అందుకే తన భర్తపై అక్రమంగా కేసులు పెట్టారని గవర్నర్‌కు కంప్లైంట్‌ ఇచ్చారు. పోలీసులు చెప్తున్న 100కు పైగా కేసులన్నీ మోటివేటెడ్‌ కేసులేనన్న ఉషా బాయ్.. ఆ కేసుల్ని ప్రజాప్రతినిధుల కోర్టులో కొట్టేశారని గుర్తు చేశారు. తన భర్తపై పోలీసుల పెట్టిన కేసులపై గవర్నర్‌ జోక్యం చేసుకోవాలని రాజాసింగ్‌ భార్య కోరారు.

ఎమ్మెల్యే రాజాసింగ్‌పై పోలీసులు పీడీయాక్ట్‌ నమోదు చేసి అరెస్ట్‌ చేసి చర్లపల్లి జైలుకు తరలించిన విషయం తెలిసిందే. మ‌హ్మ‌ద్ ప్ర‌వ‌క్త‌పై వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల కేసులో గోషామ‌హ‌ల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను మరోసారి అరెస్ట్ చేసిన పోలీసులు ఆయ‌న‌పై పీడీ యాక్ట్ కింద కేసు న‌మోదు చేశారు. రాజా సింగ్‌ను ఆయ‌న ఇంటి దగ్గరే అదుపులోకి తీసుకున్న మంగ‌ళ్ హాట్, షాహినాయ‌త్ గంజ్ పోలీసులు నేరుగా నాంప‌ల్లి కోర్టుకు త‌ర‌లించారు. ఈ క్ర‌మంలో రాజా సింగ్‌కు న్యాయ‌మూర్తి జ్యుడిషియ‌ల్ రిమాండ్ విధించారు. దీంతో పోలీసులు రాజాసింగ్ ను చర్లపల్లి జైలుకి తరలించారు.

Rajasingh: ఎమ్మెల్యే రాజాసింగ్ మళ్లీ అరెస్ట్.. ఉద్రిక్తత మధ్య అదుపులోకి తీసుకున్న పోలీసులు

ఒక ఎమ్మెల్యేపై పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేయడం తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఇదే మొదటిసారి. 2004 నుంచి రాజాసింగ్‌పై 101 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఎమ్మెల్యే రాజాసింగ్‌పై ఇటీవలే వరుస ఫిర్యాదులు, కేసులు వచ్చాయి. ఒక మతాన్ని, వర్గాన్ని కించపరిచేలా రాజాసింగ్ వ్యాఖ్యలు ఉన్నాయని కేసులు నమోదయ్యాయి. ఓ యూట్యూబ్ చానల్‌లో రాజాసింగ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు ఉన్నాయి. మహ్మద్ ప్రవక్తను ఉద్దేశిస్తూ రాజాసింగ్ వ్యాఖ్యలు చేశారని ఓ వర్గం వారు ఇటీవలే వరుస ఆందోళనలు నిరసనలతో హోరెత్తించారు.