JP Nadda : టీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతిని బయటపెడతాం, బీజేపీకి మద్దతివ్వాలి -జేపీ నడ్డా

తెలంగాణ ప్రజలు, ఉద్యోగుల కోసం బీజేపీ పోరాడుతుందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. తెలంగాణ ఉద్యోగులకు మద్దతిచ్చేందుకు నేను వచ్చా అని ఆయన చెప్పారు.

JP Nadda : టీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతిని బయటపెడతాం, బీజేపీకి మద్దతివ్వాలి -జేపీ నడ్డా

Jp Nadda

JP Nadda : తెలంగాణ ప్రజలు, ఉద్యోగుల కోసం బీజేపీ పోరాడుతుందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. తెలంగాణ ఉద్యోగులకు మద్దతిచ్చేందుకు నేను వచ్చా అని ఆయన చెప్పారు. క్రమశిక్షణ గల పార్టీ నేతగా మహాత్మాగాంధీకి నివాళి అర్పించానని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా పని చేస్తోందని నడ్డా మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా ఇక్కడ ఘటనలు ఉన్నాయన్నారు.

తెలంగాణలో డిక్టేటర్ షిప్ పాలన నడుస్తోందని, ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని, కుటుంబ పాలన సాగుతోందని నడ్డా అన్నారు. కుటుంబ, అవినీతి పాలన నుంచి తప్పించే వరకు బీజేపీ పోరాడుతుందన్నారు. జీవో 317.. ఉద్యోగ వ్యతిరేక జీవో అని నడ్డా అన్నారు. ప్రజలు, ఉద్యోగులకు అనుకూలంగా పోరాడటం మా బాధ్యత అని చెప్పారు. శాంతియుతంగా, కరోనా నిబంధనలకు అనుగుణంగా మా వాదన వినిపిస్తున్నాం అని అన్నారు.

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హైదరాబాద్ లోని బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. బండి సంజయ్ అరెస్టుకు నిరసనగా ర్యాలీలో పాల్గొనేందుకు వచ్చిన జేపీ నడ్డాను కలిసిన పోలీసులు, ర్యాలీకి అనుమతి లేదని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో పార్టీ కార్యాలయంలో నడ్డా మాట్లాడారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులకు వ్యతిరేకంగా జీవో 317 తీసుకొచ్చారని, ఆ జీవోకి వ్యతిరేకంగా బండి సంజయ్ శాంతియుతంగా నిరసన తెలిపారని వెల్లడించారు. అయితే పోలీసులు దురుసుగా వ్యవహరించి, బండి సంజయ్ జాగరణ దీక్షను భగ్నం చేశారని జేపీ నడ్డా ఆరోపించారు.

Fenugreek Seeds : చెడు కొలెస్ట్రాల్‌ను కరిగించి బరువు తగ్గించే మెంతులు

”టీఆర్ఎస్ఎస్ మంత్రులు నిబంధనలు తుంగలో తొక్కుతున్నారు. కరోనా నేపథ్యంలో బండి సంజయ్ ఎంపీ కార్యాలయంలో దీక్ష చేస్తా అని చెప్పారు. గ్యాస్ కట్టర్లు, వాటర్ క్యాన్లు ఉపయోగించి, లాఠీచార్జి చేసి సంజయ్ ని అరెస్ట్ చేశారు. కేసీఆర్ వ్యవహారాన్ని అందరూ గుర్తుంచుకోవాలి. తెలంగాణ అత్యంత అధికంగా అవినీతి ఉన్న రాష్ట్రం. కాళేశ్వరం కేసీఆర్ కు ఏటీఎంగా మారింది. రూ. 36 వేల నుండి 1.20 లక్షల కోట్లు అయ్యింది. కేసీఆర్ ఫామ్ హౌస్ కే ఉపయోగపడుతుంది. పాలమూరు నుంచి ఒక్క చుక్క నీరు రాలేదు. మిషన్ భగీరథ కూడా అంతే. కొడుకు, కూతురు వచ్చారు.

Corona New Variant IHU : కరోనా కొత్త వేరియంట్.. ఒమిక్రాన్ కంటే డేంజర్…?

ఇప్పుడు మనవడు కూడా రాజకీయాల్లోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఈ పాలనకు చరమగీతం పాడేందుకు పోరాడుతున్నాం. ఇది ధర్మ యుద్దం. ప్రజాస్వామ్య యుతంగా మేం పోరాడుతాం. టీఆర్ఎస్ ప్రజా వ్యతిరేక విధానంపై న్యాయబద్దంగా పోరాడుతాం. టీఆర్ఎస్ పై పోరాటంలో భాగంగా ఈరోజు నేను వచ్చా. రేపు ఇంకొకరు వస్తారు. పోరాటం కొనసాగుతుంది. అవినీతిని బయటపెడతాం, విచారణ చేపడతాం. సిద్దాంతాలతో నడుస్తున్న పార్టీ. అందుకు అనుగుణంగా నడుచుకుంటాం. మా పోరాటాలకు తెలంగాణ ప్రజలు మద్దతివ్వాలి. కాంగ్రెస్ పని చేయదు, ఎవరినీ పని చేయనివ్వదు” అని జేపీ నడ్డా అన్నారు.

”దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఓటముల తర్వాత కేసీఆర్ కు మతిభ్రమించినట్టుంది. అవివేకంతో వ్యవహరిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం అవినీతిమయమైంది. ఈ ప్రభుత్వాన్ని పడగొట్టేంత వరకు మా పోరాటం కొనసాగుతుంది” అని నడ్డా స్పష్టం చేశారు.