JP Nadda: తెలంగాణలో పర్యటించనున్న జేపీ నడ్డా.. సంగారెడ్డిలో కీలక సమావేశం

ఈనెల 31న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణకు రానున్నారు. ఆ రోజు సంగారెడ్డి జిల్లాలో బీజేపీ కొత్త కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. నడ్డా రానున్న నేపథ్యంలో సంగారెడ్డి జిల్లాలో సభ నిర్వహించాలా? కేవలం కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించాలా అనే అంశంపై తెలంగాణ పార్టీ అధిష్టానం చర్చలు జరుపుతుంది.

JP Nadda: తెలంగాణలో పర్యటించనున్న జేపీ నడ్డా..  సంగారెడ్డిలో కీలక సమావేశం

JP Nadda

JP Nadda: మరికొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికల గడువు దగ్గరపడుతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ వేడి రాజుకుంది. అధికార బీఆర్ఎస్ పార్టీకి మేమే ప్రత్యామ్నాయం అంటూ బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నేతలు బలంగా ప్రజల్లోకి వెళ్తున్నారు. ముఖ్యంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో పాగా వేయాలని పట్టుదలతో ఉంది. ఈ క్రమంలో బీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ప్రస్తుతం, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, సీఎం కేసీఆర్ కుమార్తె కవిత ఢిల్లీ లిక్కర్ స్కాం వ్యవహారంలో ఈసీ విచారణ ఎదుర్కొంటోంది. మరోవైపు టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారంలో బీజేపీ దూకుడుగా వ్యవహరిస్తూ బీఆర్ఎస్ ను ఇరుకున పెట్టేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ క్రమంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణ పర్యటనకు రానుండటం తెలంగాణలో రాజకీయంగా ఆసక్తి నెలకొంది.

BJP President JP Nadda: రాహుల్ గాంధీ ‘న్యూ లుక్’పై జేపీ నడ్డా ఆసక్తికర వ్యాఖ్యలు..

ఈనెల 31న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణకు రానున్నారు. ఆ రోజు సంగారెడ్డి జిల్లాలో బీజేపీ కొత్త కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. నడ్డా రానున్న నేపథ్యంలో సంగారెడ్డి జిల్లాలో సభ నిర్వహించాలా? కేవలం కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించాలా అనే అంశంపై తెలంగాణ పార్టీ అధిష్టానం చర్చలు జరుపుతుంది. ఒకవేళ సభ నిర్వహించ తలపెడితే రాష్ట్ర వ్యాప్తంగా భారీగా జనసమీకరణపై బీజేపీ నేతలు దృష్టిసారించనున్నారు. ఈనెల 12న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సంగారెడ్డి జిల్లాలలో పర్యటించాల్సి ఉంది. షెడ్యూల్ ఖరారైనప్పటికీ చివరి నిమిషంలో అమిత్ షా పర్యటన వాయిదా పడింది.

JP Nadda: బీజేపీ అధ్యక్షుడిగా జేపీ నద్దా పదవీ కాలం పొడిగింపు.. 2024 లోక్‌సభ ఎన్నికలు నద్దా నాయకత్వంలోనే

31న తెలంగాణ రాష్ట్రంకు రానున్న జేపీ నడ్డా.. సంగారెడ్డి జిల్లా కేంద్రం నుంచి రాష్ట్రంలో మరో నాలుగు, ఏపీలో రెండు జిల్లాల బీజేపీ కార్యాలయాలను వర్చువల్ గా ప్రారంభించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే, జేపీ నడ్డా పర్యటనలో భాగంగా.. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ విజయానికి ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్లాలి, బూత్ స్థాయిలో పార్టీ బలోపేతానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే అంశాలపై తెలంగాణలోని పార్టీ కార్యకర్తలకు పలు సూచనలు చేయనున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఢిల్లీ లిక్కర్ వ్యవహారంలో కవిత ఈడీ విచారణ, మరోవైపు టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ వ్యవహారంతో తెలంగాణ రాజకీయం అట్టుడుకుతున్న నేపథ్యంలో జేపీ నడ్డా రాష్ట్ర పర్యటనకు రానుండటం రాజకీయంగా ఆసక్తిని రేపుతోంది.