J.P Nadda : హైదరాబాద్‌కు నడ్డా రాక.. పోలీసుల ఆంక్షలతో ఉద్రిక్తత

బీజేపీ నేతలు చేపట్టిన శాంతి ర్యాలీ శంషాబాద్ నుంచి ప్రారంభమైంది. ఆ పార్టీ జాతీయ అధ్యక్షడు నడ్డా ఈ ర్యాలీలో పాల్గొన్నారు. అయితే ఈ ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు తెలిపారు.

J.P Nadda : హైదరాబాద్‌కు నడ్డా రాక.. పోలీసుల ఆంక్షలతో ఉద్రిక్తత

J.p Nadda

J.P Nadda : తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌ను ఆదివారం పోలీసులు అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. దీంతో బీజేపీ శ్రేణులు ఒక్కసారి భగ్గుమన్నాయి. ఈ నేపథ్యంలో నేడు సికింద్రాబాద్‌లోని మహ్మత్మాగాంధీ విగ్రహం నుంచి ప్యారడైజ్ సర్కిల్ వరకు బీజేపీ శ్రేణులు భారీగా ర్యాలీ నిర్వహించనున్నారు. అయితే ఈ ర్యాలీకి పోలీసుల నుంచి అనుమతి రాలేదు. అనుమతి లేనప్పటికీ ర్యాలీ చేసి తీరుతామని బీజేపీ శ్రేణులు చెబుతున్నాయి.

చదవండి : Bandi Sanjay: బండి సంజయ్ అరెస్ట్‌పై 48 గంటలు గడువిచ్చిన లోక్‌సభ స్పీకర్

ఇక ఈ ర్యాలీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొంటున్నారు. ఢిల్లీ నుంచి నేరుగా శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న నడ్డా.. ర్యాలీ చేసి తీరుతానని తెలిపారు. బాధ్యతగల పౌరుడిగా నిబంధనలు పాటిస్తూ ర్యాలీ తీస్తానని తెలిపారు. ఇది ప్రజాస్వామ్యం తనకిచ్చిన హక్కని తెలిపారు నడ్డా. గాంధీ విగ్రహం సికింద్రాబాద్ లోని గాంధీ విగ్రహం దగ్గరకు వెళ్తా.. పూలమాలవేసి నివాళి అర్పిస్తానని తెలిపారు నడ్డా. తన కార్యక్రమానికి ఇబ్బంది రాకుండా చూసే బాధ్యత పోలీసులు, ప్రభుత్వానిదే అని అన్నారు. తాను నిబంధనలకు కట్టుబడి ఉండేలా ప్రభుత్వం, పోలీసులు ఏర్పాట్లు చేయాలని కోరారు.

చదవండి : Bandi Sanjay: హైకోర్టుకు చేరిన బండి సంజయ్ లంచ్ మోషన్ పిటిషన్

నడ్డా శంషాబాద్ నుంచి నేరుగా సికింద్రాబాద్ ప్యారడైజ్ చేరుకుంటారు. అక్కడి నుంచి పార్టీ శ్రేణులతో ర్యాలీగా ఎంజీ రోడ్డులోని గాంధీ విగ్రవద్దకు వెళ్తారు.. అక్కడ పార్టీ నేతలతో కలిసి ఆయన గాంధీకి నివాళి అర్పిస్తారు. నడ్డా రాక నేపథ్యంలో ప్యారడైజ్ వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్నారు బీజేపీ నేతలు కార్యకర్తలు. ఇక పోలీసులు కూడా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. అయితే ఈ ర్యాలీకి పోలీసులు ఆంక్షలతో కూడిన అనుమతి ఇచ్చారంటూ మొదట వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ స్పందించారు. ర్యాలీకి ఎటువంటి అనుమతి లేదని తెలిపారు.