ఉచితంగా కరోనా వ్యాక్సిన్, లక్ష మందికి ఇళ్లు, వరద బాధితులకు రూ.25వేలు, పాతబస్తీ అభివృద్ధికి స్పెషల్ ప్యాకేజీ.. బీజేపీ గ్రేటర్ మేనిఫెస్టో

  • Published By: naveen ,Published On : November 26, 2020 / 12:56 PM IST
ఉచితంగా కరోనా వ్యాక్సిన్, లక్ష మందికి ఇళ్లు, వరద బాధితులకు రూ.25వేలు, పాతబస్తీ అభివృద్ధికి స్పెషల్ ప్యాకేజీ.. బీజేపీ గ్రేటర్ మేనిఫెస్టో

bjp ghmc manifesto: బీజేపీ జీహెచ్ఎంసీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల అయ్యింది. గురువారం(నవంబర్ 26,2020) మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఇతరులు పాల్గొన్నారు.




ఫడ్నవిస్ కామెంట్స్:
* ప్రజల ఆకాంక్షల మేరకు మేనిఫెస్టో రూపొందించాం
* తెలంగాణ ఆవిర్భావానికి సుదీర్ఘమైన పోరాటం జరిగింది
* తెలంగాణ ఏర్పాటులో బీజేపీ కీలక పాత్ర పోషించింది

* గెలిస్తే గ్రేటర్ లో ఎల్ఆర్ఎస్ రద్దు చేస్తాం
* ఎల్ఆర్ఎస్ తో రూ.15వేల కోట్ల భారం పడుతుంది
* జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ
* బడుగు బలహీన వర్గాలకు మేలు చేసేలా మేనిఫెస్టో
* 1948 సెప్టెంబర్ 17న తెలంగాణకు స్వాతంత్ర్యం వచ్చింది
* తెలంగాణకు స్వాతంత్ర్య వచ్చిన రోజున వేడుక జరపడం లేదు
* బీజేపీ గెలిస్తే సెప్టెంబర్ 17 అధికారిక విమోచన దినోత్సవం
* వరద బాధితులకు రూ.25వేలు సాయం
* మార్పు కోసం జనం, జనం కోసం బీజేపీ పేరుతో మేనిఫెస్టో విడుదల
* సెలూన్లకు ఏటా రూ.15వేల వడ్డీ లేని రుణం




* హైదరాబాద్ లో డ్రైనేజీ వ్యవస్థను మెరుగు చేస్తాం
* పక్కా ప్రణాళికతో అక్రమ నిర్మాణాల తొలగింపు
* గ్రేటర్ పరిధిలో లక్ష మంది పేదలకు ఇళ్ల పంపిణీ
https://10tv.in/communal-issues-through-social-media-dont-believe-them-inform-us-cp-anjani-kumar/
* కార్మికులకు రూ.5లక్షల ఆరోగ్య బీమా
* ఆటో డ్రైవర్లకు ఏటా రూ.7వేల సాయం
* పాతబస్తీలో కరెంట్ చౌర్యానికి చెక్
* ఓల్డ్ సిటీ అభివృద్ధికి స్పెషల్ ప్యాకేజీ
* ప్రతీ డివిజన్ లో గ్రీవెన్స్ సెల్
* ఓల్డ్ సిటీ ప్రతి డివిజన్ కు రూ.4 కోట్లకు తగ్గకుండా నిధులు
* జీహెచ్ఎంసీ పరిధిలో 28వేల కొత్త నియామకాలు
* హైదరాబాద్ నలువైపులా డంపింగ్ యార్డులు
* హెల్త్ అడ్వైజరీ సెల్ ఏర్పాటు
* ప్రతి డివిజన్ కు నాలుగు స్మశాన వాటికలు
* జీహెచ్ఎంసీ ద్వారా ఉచితంగా కరోనా టెస్టులు, వ్యాక్సిన్..



* హెల్త్ అడ్వైజరీ సెల్ ఏర్పాటు, వీధి వ్యాపారులకు ఆరోగ్య బీమా
* ఓల్డ్ సిటీకి స్పెషల్ ప్యాకేజీ, గ్రేటర్ మోడర్న్ సిటీగా మార్పు
* మూసీ పునరుజ్జీవనం, మూసీ ఫ్రంట్ డెవలప్ మెంట్
* నగరంలోని రోడ్లపై గుంతలు పడితే 15 రోజుల్లో మరమ్మతులు
* అమృత్ సిటీగా స్వచ్ఛ హైదరాబాద్, మల్టీలెవల్ పార్కింగ్ సెంటర్లు
* జంక్షన్ కు ఒక ఫ్లైఓవర్ నిర్మాణం, జిమ్, స్విమ్మింగ్ పూల్, చిల్డ్రన్ ప్లే జోన్
* వ్యాపారుల లైసెన్స్ ఫీజు, ఆస్తి పన్నులో 50శాతం రాయితీ