Telangana BJP : ఎన్ని పార్టీలు ఏకమైనా మోదీని ఏమి చేయలేరు

దేశంలోని పలు ప్రాంతీయ పార్టీలతో కలిసి కాంగ్రెస్ తో పని చేయబోతున్నారని, టీఆర్ఎస్ - కాంగ్రెస్ పార్టీలు గతంలో పొత్తులు పెట్టుకున్నాయన్నారు. ఇప్పుడు కూడా కలిసి పనిచేసేందుకు ఆ పార్టీలు...

Telangana BJP : ఎన్ని పార్టీలు ఏకమైనా మోదీని ఏమి చేయలేరు

Laxman

BJP Senior Leader Laxman : తెలంగాణ రాష్ట్రంలో హాట్ హాట్ రాజకీయాలు కొనసాగుతున్నాయి. రాజకీయ వ్యూహకర్తగా పేరొందిన ప్రశాంత్ కిశోర్.. రేపో మాపో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారనే ప్రచారం జరుగుతున్న దరిమిలా.. ఆయన హఠాత్తుగా సీఎం కేసీఆర్ తో భేటీ కావడం పొలిటిక్ వర్గాల్లో కాక రేపింది. పీకే టీం టీఆర్ఎస్ కోసం పని చేస్తుందని ఆయన వెల్లడించినట్లు తెలుస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ షాక్ కు గురైంది. బీజేపీని వ్యతిరేకించాలంటే అన్ని పార్టీలు ఏకం కావాలని పీకే సూచించడంపై తెలంగాణ బీజేపీ స్పందించింది. ఆ పార్టీ సీనియర్ నేత, బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షులు లక్ష్మణ్ 2022, ఏప్రిల్ 25వ తేదీ సోమవారం మీడియాతో మాట్లాడారు. ఎన్ని పార్టీలు ఏకమైనా మోదీని ఏమీ చేయలేరని కుండబద్ధలు కొట్టారు.

Read More : Revanth Reddy : టీఆర్ఎస్ తో తెగదెంపులు చేసుకునేందుకే పీకే కేసీఆర్ ను కలిశారు : రేవంత్ రెడ్డి

పీకే, కేసీఆర్ వ్యూహాలు తెలంగాణ రాష్ట్రంలో వర్కవుట్ కావని, వీటిని రాష్ట్ర ప్రజలు నమ్మరని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ – కాంగ్రెస్ పార్టీలు చీకటి ఒప్పందాలు చేసుకుంటున్నాయని.. ప్రజలకు వాస్తవాలు అర్థం అవుతున్నట్లు చెప్పారు. బీజేపీని వ్యతిరేకించే పార్టీలు ఏకం కావాలని కేసీఆర్ కు పీకే సలహా ఇచ్చినట్లుగా తెలిసిందని.. అయినా.. మూడోసారి దేశంలో బీజేపీదే అధికారమని జోస్యం చెప్పారు. మొన్నటి వరకు బీజేపీ, కాంగ్రెస్ యేతర ఫ్రంట్ కు ఏర్పాటు సీఎం కేసీఆర్ ప్లాన్ చేశారనే విషయాన్ని గుర్తు చేశారు. కానీ పీకేతో భేటీ తర్వాత కాంగ్రెస్ తో కలిసి పని చేసేలా కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారని విమర్శించారు.

Read More : Prashant Kishor : పీకే చేరికపై సోనియా కీలక మీటింగ్.. ఏ బాధ్యతలు ?

అందులో భాగంగానే దేశంలోని పలు ప్రాంతీయ పార్టీలతో కలిసి కాంగ్రెస్ తో పని చేయబోతున్నారని, టీఆర్ఎస్ – కాంగ్రెస్ పార్టీలు గతంలో పొత్తులు పెట్టుకున్నాయన్నారు. ఇప్పుడు కూడా కలిసి పనిచేసేందుకు ఆ పార్టీలు సిద్ధమయ్యాయన్నారు. టీఆర్ఎస్ కు ప్రధాన పోటీ కేఏ పాల్, ఎంఐఎం అని మంత్రి కేటీఆర్ అన్నట్లు… ఆయన ఒక అజ్ఞాని అంటూ తీవ్రంగా విమర్శించారు. టీఆర్ఎస్ కు ఆ పార్టీలు ఎలా ప్రత్యర్థులు అవుతాయని, ఎవరు ప్రత్యర్థి అనే విషయం ప్రజలుకు తెలువదా అని తెలిపారు. ప్రజల్లో తమకు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకపోతున్నట్లు, మొత్తంగా అన్ని విషయాలను తాము ప్రజల్లోకి తీసుకెళుతామని బీజేపీ సీనియర్ నేత లక్ష్మణ్ తెలిపారు.