BJP Target Telangana : తెలంగాణను టార్గెట్ చేసిన బీజేపీ.. నెలకోసారి రాష్ట్రానికి ప్రధాని మోదీ, జిల్లాల పర్యటన

ఇందులో భాగంగానే ప్రతి నెల తెలంగాణలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ టూర్ ఉండేలా ప్లాన్ చేస్తోంది. మధ్య మధ్యలో పార్లమెంట్ నియోజకవర్గల పరిధిలో కేంద్ర మంత్రుల పర్యటన ఉండేలా ప్రాణాళికలు రచిస్తోంది. ఏప్రిల్ 8వ తేదీన ప్రధాని నరేంద్రమోదీ హైదరాబాద్ కు రానున్నారు.

BJP Target Telangana : తెలంగాణను టార్గెట్ చేసిన బీజేపీ.. నెలకోసారి రాష్ట్రానికి ప్రధాని మోదీ, జిల్లాల పర్యటన

BJP target

BJP Target Telangana : తెలంగాణ రాష్ట్రంపై భారతీయ జనతా పార్టీ(బీజేపీ) ఫోకస్ పెట్టింది. రాష్ట్రంలో అధికారంలోకి రావాలని యోచిస్తోంది.. అందుకుగానూ విశ్వప్రయత్నాలు చేస్తోంది. తెలంగాణ టార్గెట్ గా బీజేపీ పావులు కదుపుతోంది. ఎలాగైనా తెలంగాణలో అధికారాన్ని చేజిక్కించుకోవాలని ఉవ్విల్లూరుతోంది. ఈ మేరకు వచ్చే నాలుగు నెలలకు బీజేపీ ప్రణాళికలు రచిస్తోంది. కర్ణాటక ఎన్నికలు ముగియగానే తెలంగాణపై మరింత దూకుడు పెంచనుంది.

ఇందులో భాగంగానే ప్రతి నెల తెలంగాణలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ టూర్ ఉండేలా ప్లాన్ చేస్తోంది. మధ్య మధ్యలో పార్లమెంట్ నియోజకవర్గల పరిధిలో కేంద్ర మంత్రుల పర్యటన ఉండేలా ప్రాణాళికలు రచిస్తోంది. ఏప్రిల్ 8వ తేదీన ప్రధాని నరేంద్రమోదీ హైదరాబాద్ కు రానున్నారు. రూ.700 కోట్లతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. అలాగే, కాజీపేట రైల్వే కోచ్ ఒరలింగ్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేస్తారు.

Bandi Sanjay : పక్కా.. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం-బండి సంజయ్

సికింద్రాబాద్ – తిరుపతి వందే భారత్ ఎక్సపెస్ ను ప్రారంభించనున్నారు. మే నెలలో వరంగల్ లేదా సిరిసిల్లలో ప్రధాని పర్యటించనున్నారు. మెగా టెక్ స్టైల్ పార్కుకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. జూన్ నెలలో నల్లగొండ జిల్లాలో ప్రధాని పర్యటన చేయనున్నారు. ఎయిమ్స్ ను మోదీ జాతికి అంకితం చేయనున్నారు. ఆ తరువాత ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా జాతీయ రహదారులకు శంకుస్థాపన, నిర్మాణం పూర్తి ఐన వాటిని జాతికి అంకితం చేస్తారు.

ఏప్రిల్ 8వ తేదీన సికింద్రాబాద్ నుండి వందే భారత్ ఎక్సపెస్ ను ప్రధాని మోదీ ఘనంగా ప్రారంభించనున్నట్లు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన ప్రధాని మోదీకి ధన్యవాదాములు తెలిపారు. సికింద్రాబాద్ – తిరుపతి మధ్య వందే భారత్ ఎక్సపెస్ సేవలు అందనున్నాయి. గమ్యస్థానాన్ని చేరుకోవటానికి కేవలం 8 గం.ల 30 ని.ల సమయం పట్టనుంది.

BJP : నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ నూతన అధ్యక్షులు.. నియమించిన జేపీ నడ్డా

భాగ్యనగరం హైదరాబాద్ నుండి ఆధ్యాత్మిక నగరం తిరుపతిని సందర్శించనున్న వారికి అనుకూలంగా సేవలు అందించనుంది. నల్గొండ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు స్టేషన్లలో రైలు ఆగనుంది. ప్రారంభోత్సవం రోజున నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ళ, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు స్టేషన్లలో రైలు ఆగనుంది. మేక్ ఇన్ ఇండియా వందేభారత్ రైలు ఆగనున్న అన్ని స్టేషన్లలో స్థానిక ప్రజలు ఘనంగా స్వాగతం తెలపాలని కిషన్ రెడ్డి కోరారు.