Bandi Sanjay : బీజేపీలో ఉంటేనే అవకాశాలు వస్తాయి.. పార్టీలోకి తిరిగి రావాలని మాజీలకు బండి సంజయ్ పిలుపు

బీజేపీని వీడిన నేతలు పార్టీలోకి తిరిగి రావాలని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ పిలుపునిచ్చారు. విజయశాంతి 25ఏళ్ల రాజకీయ ప్రయాణం కార్యక్రమంలో పాల్గొన్న బండి సంజయ్.. బీజేపీ మాజీలకు ఆఫర్ ప్రకటించారు.

Bandi Sanjay : బీజేపీలో ఉంటేనే అవకాశాలు వస్తాయి.. పార్టీలోకి తిరిగి రావాలని మాజీలకు బండి సంజయ్ పిలుపు

Bandi Sanjay : బీజేపీని వీడిన నేతలు పార్టీలోకి తిరిగి రావాలని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ పిలుపునిచ్చారు. విజయశాంతి 25ఏళ్ల రాజకీయ ప్రయాణం కార్యక్రమంలో పాల్గొన్న బండి సంజయ్.. బీజేపీ మాజీలకు ఆఫర్ ప్రకటించారు. చిన్న చిన్న కారణాలతో పార్టీని వీడారన్న బండి సంజయ్.. సిద్ధాంతం కోసం తిరిగి బీజేపీలోకి రావాలన్నారు. తెలంగాణ కోసం కలిసి పోరాటం చేద్దామన్న బండి సంజయ్.. బీజేపీలో ఉంటేనే అవకాశాలు వస్తాయన్నారు. బీజేపీనే విజయశాంతికి చివరి మజిలీ కావాలన్న బండి సంజయ్.. విజయశాంతి వంటి ఎంతోమంది ఉద్యమకారులను కేసీఆర్ మోసం చేశారని మండిపడ్డారు.

Also Read..TarakaRathna : నటుడు తారకరత్నకు అస్వస్థత.. కుప్పం ఆసుపత్రిలో చికిత్స..

తాను తెలంగాణ కోసం పోరాడి అందరికి మాత్రం శత్రువులా మారానని సినీ నటి, బీజేపీ నాయకురాలు విజయశాంతి అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావాలన్నదే చిన్నప్పటి నుంచి తన కల అని చెప్పారు. అవినీతి లేని క్రమశిక్షణ గల పార్టీ బీజేపీ అని అందుకే ఈ పార్టీలో చేరానన్నారు. విజయశాంతి రాజకీయాల్లోకి వచ్చి 25 ఏళ్లు అయ్యింది. ఈ సందర్భంగా హైదరాబాద్ బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

Also Read..Nara Lokesh : చీరలు కట్టుకుని గాజులు వేసుకునే వాళ్లు చేతకాని వాళ్లా? మంత్రి రోజాను టార్గెట్ చేసిన లోకేశ్

”1998 జనవరి 26న వాజ్ పేయి, అద్వానీల సమక్షంలో బీజేపీలో చేరాను. బీజేపీతోనే నా రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పని చేస్తున్నాం. సినీ పరిశ్రమలో 43ఏళ్లు పని చేశా. కానీ రాజకీయాల్లో ఉన్న ఈ 25 ఏళ్లు మాత్రం సుదీర్ఘంగా అనిపించాయి. తెలంగాణ కోసం మొదటి నుంచి బీజేపీ పోరాటం చేసింది. సోనియా గాంధీకి వ్యతిరేకంగా పోటీ చేయమని అద్వానీ అడిగారు. ఎన్ని కష్టాలైనా, నష్టాలైనా, వెన్నుపోట్లు ఉన్న పోరాడుతూ వచ్చాను. తెలంగాణ వాదం వదిలిపెడితే ఎన్నో పదవులు వచ్చేవి. అసలు తెలంగాణ కోసమే నేను బయటకు వచ్చాను” అని విజయశాంతి అన్నారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.