Bandi Sanjay : మహిళా కమిషన్ లేఖకు బండి సంజయ్ రిప్లై

తెలంగాణ మహిళా కమిషన్ కు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ లేఖ రాశారు. బుధవారం విచారణకు హాజరు కావాలన్న మహిళా కమిషన్ నోటీసులపై ఆయన రిప్లై ఇచ్చారు.

Bandi Sanjay : మహిళా కమిషన్ లేఖకు బండి సంజయ్ రిప్లై

bandi sanjay

Bandi Sanjay : తెలంగాణ మహిళా కమిషన్ కు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ లేఖ రాశారు. బుధవారం విచారణకు హాజరు కావాలన్న మహిళా కమిషన్ నోటీసులపై ఆయన రిప్లై ఇచ్చారు. బుధవారం ఉదయం 11 గంటలకు వ్యక్తిగతంగా హాజరు కావాలని మహిళా కమిషన్ బండి సంజయ్ ను ఆదేశించింది. అయితే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నందున మీరు చెప్పిన తేదీల్లో హాజరు కాలేనని లేఖలో పేర్కొన్నారు. మార్చి 18న ఏ సమయంలోనైనా హాజరయ్యేందుకు సిద్ధమని చెప్పారు.

ఎమ్మెల్సీ కవితపై బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలు చేశారని బీఆర్ఎస్ నేతలు మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశారు. దీంతో మహిళా కమిషన్ బండి సంజయ్ కు నోటీసులు జారీ చేసింది. తన వ్యాఖ్యలపై సమాధానం ఇచ్చేందుకు వ్యక్తిగతంగా కమిషన్ ముందు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు విచారణ నేపథ్యంలో ఇటీవల బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఈ వ్యాఖ్యలపై మహిళా కమిషన్ తీవ్రంగా స్పందించింది.

TSPSC Paper Leak : TSPSC ప్రశ్నాపత్రాలు, గ్రూప్-1 ప్రశ్నాపత్రం లీక్ .. బీఆర్ఎస్ ప్రభుత్వంపై బండి సంజయ్ ఘాటు విమర్శలు

ఈ కేసును సుమోటోగా స్వీకరించిన కమిషన్ సోమవారం బండి సంజయ్‌కు నోటీసులు జారీ చేసింది. మార్చి 15న ఉదయం 11 గంటలకు కమిషన్ ముందు విచారణకు నేరుగా హాజరు కావాలని ఆదేశించింది. అయితే, ఈ నోటీసులు తీసుకునేందుకు బీజేపీ కార్యాలయ ప్రతినిధులు నిరాకరించారు. బండి సంజయ్‌కు వ్యక్తిగతంగా వచ్చిన నోటీసులను తామెలా తీసుకుంటామని బీజేపీ కార్యాలయ సిబ్బంది చెప్పింది.

బండి సంజయ్ పార్లమెంటు సమావేశాల్లో ఉన్నందున నోటీసులను తాము తీసుకోలేమని తెలిపారు. కాగా, బండి సంజయ్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ శ్రేణులు మండిపడ్డాయి. ఆయనకు వ్యతిరేకంగా నిరసనలకు దిగాయి. బండి సంజయ్ క్షమాపణలు చెప్పాలని బీఆర్ఎస్ శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి. పలు పోలీస్ స్టేషన్లలో బండి సంజయ్ పై బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు బండిపై కేసు నమోదు చేశారు.