BJP Vs BRS : కేసీఆర్‌ను తెలంగాణకు పరిమితం చేయాలని కేంద్రం చూస్తోంది-బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

సీఆర్ ను తెలంగాణకు పరిమితం చేయాలని కేంద్రం చూస్తోంది. అందులో భాగంగానే బీఆర్ఎస్ నేతలపై తప్పుడు కేసులు. బీజేపీకి ఎదురు తిరిగితే తప్పుడు కేసుల్లో ఇరికిస్తారు. బీజేపీలో చేరితే కుంభకోణాలు మొత్తం పోతాయి.(BJP Vs BRS)

BJP Vs BRS : కేసీఆర్‌ను తెలంగాణకు పరిమితం చేయాలని కేంద్రం చూస్తోంది-బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

CM KCR

BJP Vs BRS : తెలంగాణలో రాజకీయాలు వేడెక్కాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. ఓవైపు ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ, మరోవైపు బండి సంజయ్ వ్యాఖ్యలు.. రాజకీయాల్లో హీట్ పెంచాయి. బీఆర్ఎస్, బీజేపీ మధ్య చిచ్చు రాజుకుంది. ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేసుకుంటున్నారు. సై అంటే సై అంటూ రెచ్చిపోతున్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్, ప్రధాని మోదీ, తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ టార్గెట్ గా బీఆర్ఎస్ నేతలు నిప్పులు చెరుగుతున్నారు. కవిత ఈడీ విచారణ ముమ్మాటికీ రాజకీయ కక్ష సాధింపు చర్యే అంటున్నారు.

కోరుకంటి చందర్, ఎమ్మెల్యే
భారత్ మాతకి జై అని చెప్పుకునే సిద్ధాంతాన్ని వదిలి దుర్మారంగా మాట్లాడారు. కవితపై అనుచిత వ్యాఖ్యలు చేయడం వెనుక ఆలోచన అర్ధం అవుతోంది. సంజయ్ నిజంగా ప్రజల దగ్గరకు వస్తే.. మహిళలు చెప్పులతో కొట్టే రోజులు వచ్చాయి. కేంద్రం నుంచి ఏదో తెస్తారని ప్రజలు భరించారు. మీ పార్లమెంట్ పరిధిలో మెడికల్ కళాశాల ఇవ్వకపోతే సైలెంట్ గా ఉంటావు. మానవతా విలువలు లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడితే గుణపాఠం చెప్పే రోజులు దగ్గర పడ్డాయి. మా మంచితనాన్ని బలహీనంగా చూడొద్దు. కవితపై చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి.(BJP Vs BRS)

Also Read..MLC Kavitha : లిక్కర్ స్కామ్ తో నాకు సంబంధం లేదు-తేల్చి చెప్పిన కవిత

సైదిరెడ్డి, ఎమ్మెల్యే
మోదీ సమన్ల మాదిరిగానే బీజేపీ నేతల మాటలు ఉన్నాయి. విచారణ విషయాలు అరవింద్ కు ఎలా తెలిశాయి? సంజయ్, అరవింద్ లు ఒకరంటే ఒకరికి పడదు. రాజకీయాల కోసం బీజేపీ నేతలు ఎంతకైనా తెగిస్తారు. కేసీఆర్ పథకాలు మమ్మల్ని మళ్ళీ గెలిపిస్తాయి. డబుల్ ఇంజన్ బ్రోకర్ సర్కార్. కేసీఆర్ ను తెలంగాణకు పరిమితం చేయాలని కేంద్రం చూస్తోంది. అందులో భాగంగానే బీఆర్ఎస్ నేతలపై తప్పుడు కేసులు.(BJP Vs BRS)

Also Read..Bandi Sanjay Comments: మహిళల్ని అవమానించిన బండి సంజయ్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి.. బీఆర్ఎస్ మహిళా మంత్రుల డిమాండ్

బీజేపీకి ఎదురు తిరిగితే తప్పుడు కేసుల్లో ఇరికిస్తారు. బీజేపీలో చేరితే కుంభకోణాలు మొత్తం పోతాయి. అత్యవసర సమయం కంటే ఘోరంగా దేశంలో పరిస్థితులు ఉన్నాయి. ప్రపంచంలో సిగ్గు లేకుండా ఉన్న పార్టీ బీజేపీ. మహిళల మీద చేస్తున్న వ్యాఖ్యలు బాధాకరం. బీహార్ లో కూడా మళ్లీ కేసులు మొదలు పెట్టారు. దేశాన్ని బడా వ్యాపారులకు కట్టబెట్టే యత్నం ప్రధాని మోదీ చేస్తున్నారు. తెలంగాణ అభివృద్ధిని బీజేపీ అడ్డుకుంటోంది. ప్రజలు బీజేపీ నేతల వైఖరి గమనిస్తున్నారు.

Also Read..Gajjala Kantham: బండి సంజయ్‌పై సీబీఐ, ఈడీ దాడులు చేయించాలి.. ప్రజా సంఘాల జేఏసీ ఛైర్మన్ గజ్జల కాంతం డిమాండ్

చిరుమర్తి లింగయ్య, ఎమ్మెల్యే
బీజేపీ నేతలు మదమెక్కిన కుక్కల్లా వ్యవహరిస్తున్నారు. ఎన్నికలు వస్తే…రాజకీయం చేస్తారు మోదీ. రాష్ట్ర బీజేపీ నేతలకు కేసీఆర్ నాయకత్వంలో అభివృద్ధి కనిపించడం లేదా? పార్లమెంటులో కేంద్రమే తెలంగాణ అభివృద్ధి గురించి చెబుతోంది. కేసీఆర్ ను తిడితే పదవులు వస్తాయని బీజేపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. కవితను కించపరిచే విధంగా సంజయ్ మాట్లాడడం ఎంతవరకు సమంజసం? కేసీఆర్ నాయకత్వాన్ని దేశం కోరుకుంటోంది. దీన్ని అడ్డుకునేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తోంది. సంజయ్ బేషరతుగా క్షమాపణ చెప్పకపోతే చెప్పులతో కొట్టే పరిస్థితి ఉంది.(BJP Vs BRS)