Sunil Bansal : 2023 ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీకి అధికారంలోకి రావడం పక్కా-సునీల్ బన్సల్

తెలంగాణలో కుటుంబపాలను, అవినీతిని చూసి ప్రజలు బీజేపీని గెలిపించేందుకు సిద్ధమవుతున్నారని అన్నారు. 2023లో జరిగే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం పక్కా అని ధీమా వ్యక్తం చేశారు సునీల్ బన్సల్.

Sunil Bansal : 2023 ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీకి అధికారంలోకి రావడం పక్కా-సునీల్ బన్సల్

Sunil Bansal : మునుగోడు ఉపఎన్నికలో బీజేపీ గెలుపు ఖాయం అన్నారు ఆ పార్టీ తెలంగాణ సంస్థాగత వ్యవహారాల ఇంచార్జ్ సునీల్ బన్సల్. మునుగోడు నియోజకవర్గం బీజేపీ ముఖ్యకార్యకర్తల సమావేశంలో బన్సల్ పాల్గొన్నారు.

ఉపఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు. తెలంగాణలో కుటుంబపాలను, అవినీతిని చూసి ప్రజలు బీజేపీని గెలిపించేందుకు సిద్ధమవుతున్నారని అన్నారు. 2023లో జరిగే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం పక్కా అని ధీమా వ్యక్తం చేశారు సునీల్ బన్సల్.

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మునుగోడు అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నిక జరగనుంది. ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరిపోయారు. మునుగోడు ఉప ఎన్నికకు ప్రధాన పార్టీలు రెడీ అవుతున్నాయి. ఉప ఎన్నికలో సత్తా చాటేందుకు వ్యూహాలు రచిస్తున్నాయి. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్.. మునుగోడులో గెలుపే లక్ష్యంగా పని చేస్తున్నాయి.

టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య మాటలతూటాలు పేలుతున్నాయి. దేశానికి ద్రోహం చేస్తున్న బీజేపీకి మునుగోడు ప్రజలు ఉప ఎన్నికతో సరైన గుణపాఠం చెబుతారని టీఆర్ఎస్ నేతలు అంటున్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీకి మూడో స్థానమేనని చెప్పారు. బీజేపీలో చేరి రాజగోపాల్ రెడ్డి చరిత్ర హినుడిగా మిగిలిపోతాడని విమర్శించారు.

మునుగోడు ఉప ఎన్నిక.. భవిష్యత్తుకు సంబంధించిన పోరాటం అని రాజగోపాల్ రెడ్డి అన్నారు. మునుగోడు ఉపఎన్నికను తెలంగాణ మలి ఉద్యమంగా ఆయన అభివర్ణించారు. మునుగోడు ప్రజలు అధికార టీఆర్ఎస్ కు కనువిప్పు కలిగే తీర్పు ఇస్తారని ధీమా వ్యక్తం చేశారు రాజగోపాల్ రెడ్డి.

తన సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు కాంగ్రెస్ పార్టీ కూడా గట్టిగానే పోరాటం చేస్తోంది. ఇతర పార్టీలకన్నా ముందుగానే తన అభ్యర్థిని ప్రకటించేసింది కాంగ్రెస్. తన విజయానికి కృషి చేయాలంటూ.. ప్రచారానికి పార్టీ పెద్దలను ఆహ్వానిస్తున్నారు ముగుగోడు కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి. తనకు మద్దతుగా మునుగోడులో ప్రచారం చేయాలని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని సైతం కలిశారు పాల్వాయి స్రవంతి. మునుగోడు ప్రచారానికి వస్తానని కోమటిరెడ్డి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.