Book fair: హైదరాబాద్‭లో ప్రారంభమైన మరో బుక్‌ ఫెయిర్‌

2019లో కార్యకలాపాలు ప్రారంభించిన నాటి నుంచి భారతదేశ వ్యాప్తంగా 20 నగరాలలో 50కు పైగా బుక్‌ ఫెయిర్స్‌ను కితాబ్‌ లవర్స్‌ నిర్వహించింది. తమ ‘లోడ్‌ ద బాక్స్‌’ ప్రచారం ద్వారా, రీడింగ్‌ను అందుబాటులో ప్రతి భారతీయునికీ చేరువచేయడానికి ప్రయత్నిస్తుంది. ఈ బుక్‌ ఫెయిర్‌లో ఉచిత రీడింగ్‌ కార్నర్‌ కూడా ఉంటుంది

Book fair: హైదరాబాద్‭లో ప్రారంభమైన మరో బుక్‌ ఫెయిర్‌

Book fair started at Next Premia Mall

Book fair: అత్యంత అందుబాటు ధరలలో పుస్తకాలను విక్రయించడం ద్వారా ఖ్యాతి గడించిన కితాబ్‌ లవర్స్‌ సంస్థ హైదరాబాద్‭లో తొమ్మిది (9) రోజుల పాటు బుక్‌ ఫెయిర్‌ను నిర్వహించబోతుంది. ఈ బుక్‌ ఫెయిర్‌ మార్చి 25వ తేదీన ఇర్రమ్‌ మంజిల్‌ మెట్రో స్టేషన్‌తో అనుసంధానితమైఉన్న నెక్ట్స్‌ ప్రీమియా మాల్‌ లోయర్‌ గ్రౌండ్‌ ఫ్లోర్‌ వద్ద ఏప్రిల్‌ 02 వ తేదీ వరకూ జరుగనుంది. తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ బుక్‌ ఫెయిర్‌లో 20కు పైగా జెనర్స్‌లో 10 లక్షల కు పైగా పుస్తకాలను అందుబాటులో ఉంచారు.

Chris Gayle: కోహ్లీతో ఆడిన రోజులను గుర్తు చేసుకుంటూ అతడిపై క్రిస్ గేల్ ప్రశంసల జల్లు

ఈ ఫెయిర్‌ గురించి కితాబ్‌ లవర్స్‌ ఫౌండర్‌ రాహుల్‌ పాండే మాట్లాడుతూ ‘‘హైదరాబాద్‌లో బుక్‌ ఫెయిర్‌ నిర్వహించడం పట్ల సంతోషంగా ఉన్నాము. నగరంలో మేము నిర్వహిస్తోన్న 5వ కార్యక్రమమిది. ఈ బుక్‌ఫెయిర్‌లో అత్యంత సరసమైన ధరలలో పుస్తకాలను అందిస్తుండటం వల్ల అధిక శాతం మంది పుస్తకప్రేమికులకు సంతోషాన్ని అందించగలుగుతున్నాము. చిన్నారుల నుంచి సీనియర్‌ సిటిజన్ల వరకూ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునే జెనర్‌లో పుస్తకాలు లభ్యమవుతాయి’’ అని అన్నారు.

Amritpal Singh: పోలీసులు తీవ్ర వేట నేపథ్యంలో అమృతపాల్ సింగ్‭కు సిక్కు సంఘం పిలుపు

భారతీయుల పుస్తకపఠన అలవాట్లను గురించి రాహుల్‌ మాట్లాడుతూ ‘‘మనం నేడు నివశిస్తోన్న డిజిటల్‌ ప్రపంచంలో, పుస్తక పఠనాసక్తి గణనీయంగా పడిపోతుంది. ఇంటర్నెట్‌, సోషల్‌మీడియా మనకు అసాధారణ వినోదం అందిస్తున్నప్పటికీ ఓ మంచి పుస్తకం అందించే విజ్ఞానం మాత్రం అందించలేవు. మరింత మంది మరీ ముఖ్యంగా తల్లిదండ్రులు తమ పిల్లలతో సహా ఈ బుక్‌ ఫెయిర్‌ను సందర్శించాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము’’ అని అన్నారు.

MLA Jagga Reddy : అద్వానీ ప్రధాని కాకుండా మోడీ కుట్రలు చేశారు- ఎమ్మెల్యే జగ్గారెడ్డి

2019లో కార్యకలాపాలు ప్రారంభించిన నాటి నుంచి భారతదేశ వ్యాప్తంగా 20 నగరాలలో 50కు పైగా బుక్‌ ఫెయిర్స్‌ను కితాబ్‌ లవర్స్‌ నిర్వహించింది. తమ ‘లోడ్‌ ద బాక్స్‌’ ప్రచారం ద్వారా, రీడింగ్‌ను అందుబాటులో ప్రతి భారతీయునికీ చేరువచేయడానికి ప్రయత్నిస్తుంది. ఈ బుక్‌ ఫెయిర్‌లో ఉచిత రీడింగ్‌ కార్నర్‌ కూడా ఉంటుంది. అంతేకాకుండా నూతనంగా ఆవిష్కరించిన పుస్తకాల కోసం ప్రత్యేకంగా విభాగమూ ఇక్కడ ఉంటుంది.