బోయిన్ పల్లి కిడ్నాప్ కేసు : గాంధీ ఆస్పత్రికి భూమా అఖిల ప్రియ

బోయిన్ పల్లి కిడ్నాప్ కేసు : గాంధీ ఆస్పత్రికి భూమా అఖిల ప్రియ

Bowenpally Kidnap Case : బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో మూడు రోజుల రిమాండ్ ముగియడంతో మాజీ మంత్రి అఖిలప్రియను వైద్యపరీక్షల కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. అనంతరం అఖిలప్రియను మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చనున్నారు. కోర్టుకు సెలవుకావడంతో న్యాయమూర్తి నివాసంలో ఆమెను హాజరుపరుస్తారు. తర్వాత ఆమెను చంచల్ గూడ జైలుకు తరలించనున్నారు.

అంతకముందు అఖిలప్రియను గాంధీ ఆస్పత్రికి తరలించే సమయంలో పోలీసులు మీడియా కంట చిక్కకుండా అనేక మార్లు రూట్ మార్చారు. మొదట అఖిలను గాంధీ ఆస్పత్రికి తరలిస్తామని చెప్పిన వైద్యులు అక్కడికి కాకుండా బేగంపేటలోని పాటిగడ్డ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్‌కు తరలించారు. అక్కడ కరోనా పరీక్షలు నిర్వహించిన అనంతరం మళ్లీ గాంధీ ఆస్పత్రికి తరలించారు. అఖిల ప్రియ పోలీస్ వాహనం ముందు ఎస్కార్ట్‌గా మహిళా పోలీసులను ఉంచారు.

మరోవైపు మూడు రోజుల కస్టడీలో అఖిల ప్రియ నుంచి కీలక వివరాలు రాబట్టారు పోలీసులు. మూడు రోజుల్లో 30 గంటల పాటు ఆమెను విచారించిన పోలీసులు 300 ప్రశ్నలు అడిగారు. అఖిల ప్రియ ఇచ్చిన సమాధానాల ఆధారంగా కిడ్నాప్‌ ప్రణాళికలో ఆమెతో పాటు, భర్త భార్గవ్ రామ్ పాత్రలపై పోలీసులకు ఓ క్లారిటీ వచ్చినట్టు సమాచారం. కిడ్నాప్ సమయంలో ప్రవీణ్ రావు నివాసం దగ్గర భార్గవ్ రెక్కీ నిర్వహించినట్లు పోలీసులు నిర్ధారించారు. బాలీవుడ్ మూవీ కిడ్నాప్‌ ప్లాన్‌కు గైడ్‌గా మారినట్టు నిర్ధారించారు.