Hyderabad : ప్రియుడి మాటలు నమ్మి అమెరికా నుంచి వచ్చింది.. చివరకు మోసపోయింది

ఓ యువతిని ఆన్‌లైన్‌లో పరిచయం చేసుకొని తనకు కోట్ల ఆస్తులు ఉన్నాయని పెళ్లి చేసుకుంటానని నమ్మించాడో యువకుడు. యువకుడి మాటలు నమ్మిన యువతి అమెరికాలో చదువు ఆపేసి మరి ఇండియాకు తిరిగి వచ్చింది. చివరకు యువకుడి చేతిలో మోసపోయానని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Hyderabad : ప్రియుడి మాటలు నమ్మి అమెరికా నుంచి వచ్చింది.. చివరకు మోసపోయింది

Hyderabad

Hyderabad : ఓ యువతిని ఆన్‌లైన్‌లో పరిచయం చేసుకొని తనకు కోట్ల ఆస్తులు ఉన్నాయని పెళ్లి చేసుకుంటానని నమ్మించాడో యువకుడు. యువకుడి మాటలు నమ్మిన యువతి అమెరికాలో చదువు ఆపేసి మరి ఇండియాకు తిరిగి వచ్చింది. చివరకు యువకుడి చేతిలో మోసపోయింది. పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం నగరానికి చెందిన ఆదిత్యకు బీటెక్ సోమాజిగూడకు చెందిన బీటెక్ పూర్తిచేసిన ఓ యువతి ఆన్‌లైన్‌లో పరిచయమైంది. ఇద్దరి పరిచయం ప్రేమగా మారింది. ఇద్దరు కలిసి నెలరోజులు సహజీవనం చేశారు.

ఈ నేపథ్యంలోనే మాస్టర్స్ చదివేందుకు ఈ ఏడాది జనవరి 13న అమెరికా వెళ్ళింది యువతి. ప్రతి రోజూ ఆమెకు ఫోన్‌ చేసి ఇండియాకు రావాలని, తనపేరుమీద రూ.13 కోట్ల ఫిక్స్‌డిపాజిట్లు ఉన్నాయని, బెంగళూరులో ఆస్తులు ఉన్నాయని నమ్మబలికాడు. యువకుడి మాటలు నమ్మిన యువతి వెళ్లిన నెలకే అమెరికా నుంచి ఇండియాకు వచ్చింది.ఇక్కడికి వచ్చిన తర్వాత ఇద్దరు కలిసి టూర్ వెళ్లారు. జులైలో టూర్ ముగించుకొని నగరానికి వచ్చారు. ఆ తర్వాత కొద్దీ రోజులకు బంజారాహిల్స్ లో ఇంటిని కిరాయికి తీసుకున్నారు.

తనకు బెంగళూరులో ఆస్తులు ఉన్నాయని వాటికి సంబందించిన రేట్స్ రావాల్సి ఉందని.. డబ్బు తీసుకోని వస్తానని వెళ్ళాడు. ఆ రోజు నుంచి ఆదిత్య ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ వస్తుంది ఎన్ని సార్లు చేసిన ఫోన్ కలవలేదు. దీంతో యువతి పంజగుట్ట పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఆదిత్య లొకేషన్ గుర్తించే పనిలో పడ్డారు పోలీసులు.