Harassment: పెండ్లి చేసుకోకపోతే.. మీ అమ్మనాన్నలను చంపేస్తా

ప్రేమ పేరుతో యువతిని వేధింపులకు గురిచేస్తూ.. పెళ్లి చేసుకోకపోతే తల్లిదండ్రులను చంపుతానని బెదిరించిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసు వివరాలను ఓసారి పరిశీలిస్తే.. ఆంధ్రప్రదేశ్, అనంతపురం జిల్లా తాడిపత్రి ప్రాంతానికి చెందిన పాలకూరు నవీన్ లా రెండవ సంవత్సరం చదువుతున్నాడు.

Harassment: పెండ్లి చేసుకోకపోతే.. మీ అమ్మనాన్నలను చంపేస్తా

Boy Harass A Girl For Marriage

Harassment: ప్రేమ పేరుతో యువతిని వేధింపులకు గురిచేస్తూ.. పెళ్లి చేసుకోకపోతే తల్లిదండ్రులను చంపుతానని బెదిరించిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసు వివరాలను ఓసారి పరిశీలిస్తే.. ఆంధ్రప్రదేశ్, అనంతపురం జిల్లా తాడిపత్రి ప్రాంతానికి చెందిన పాలకూరు నవీన్ లా రెండవ సంవత్సరం చదువుతున్నాడు. టిక్ టాక్ ఉన్న సమయంలో అందులో వీడియోలు చేసేవాడు.

టిక్‌టాక్‌ ద్వారా చాలా మందికి ఫ్రెండ్‌ రిక్వెస్టులు పంపించి.. అందులో యువతులు, మహిళలతో స్నేహం చేసేవాడు.. వారిని వేధింపులకు గురిచేసేవాడు. కానీ ఎవరు నవీన్ పై ఫిర్యాదు చేసే దైర్యం చెయ్యలేదు. తాజాగా ఓ యువతిని ఆన్‌లైన్‌ వీడియో బ్లాగింగ్‌ యాప్‌ ద్వారా పరిచయం చేసుకున్నాడు. ప్రేమిస్తున్నానని తనను పెళ్లి చేసుకోవాలని వేధింపులకు గురిచేస్తున్నాడు.

అస్లీల వీడియోలను సదరు యువతికి పంపేవాడు. రాను రాను వేధింపులు ఎక్కువ చేశాడు నవీన్.. పెళ్లి చేసుకోకపోతే తల్లిదండ్రులను చంపేస్తానని బెదిరించాడు. నవీన్ వేధింపులకు విసిగిపోయిన యువతి.. మేనత్తకు తెలిపింది. దీంతో ఆమె నవీన్ ను మందలించింది. ఆమెపై కక్ష పెంచుకుని ఆమెను వేధింపులకు గురిచేయడం స్టార్ట్ చేశాడు. అసభ్య వీడియోలను పంపాడు.

అంతటితో ఆగకుండా డేటింగ్ యాప్స్ లో ఆమె ఫోటో పెట్టి ఫోన్ నంబర్ ఇచ్చాడు.. దీంతో సదరు మహిళకు రోజు కాల్స్ వస్తుండటంతో ఆమె సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించింది. వెంటనే కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేసి సాంకేతిక ఆధారాలను సేకరించి. నిందితుడు నవీన్‌ను అరెస్ట్‌ చేశారు.