ట్విస్ట్ మాములుగా లేదు : పెళ్లి ఆపమంటూ వచ్చిన అమ్మాయి.. పంపేసిన పోలీసులు.. చివరకు ఆగిన పెళ్లి

  • Published By: vamsi ,Published On : November 12, 2020 / 09:39 AM IST
ట్విస్ట్ మాములుగా లేదు : పెళ్లి ఆపమంటూ వచ్చిన అమ్మాయి.. పంపేసిన పోలీసులు.. చివరకు ఆగిన పెళ్లి

తెలుగు సినిమా క్లైమాక్స్ ట్విస్ట్‌ మాదిరిగానే సికింద్రాబాద్ నగరంలో ఓ పెళ్లి ఆగిపోయింది. జన‌గామ జిల్లా యశ్వం‌త‌పూ‌ర్‌కు చెందిన అనిల్‌ హైద‌రా‌బాద్‌ శివారు చౌద‌రి‌గూ‌డ‌లోని అమ్మమ్మ ఇంట్లో కొంత‌కా‌లంగా ఉంటూ ఉద్యోగం చేస్తున్నాడు. అక్కడే అనీల్‌కి ఓ యువతి పరిచయం అవ్వగా.. ఆమెతో కాకుండా సికింద్రా‌బాద్‌ అడ్డ‌గుట్ట ప్రాంతా‌నికి చెందిన బంధువుల అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు సిద్ధం అయ్యాడు అనీల్.



పెళ్లికి అంతా సిద్ధమై చర్చిలో పెళ్లి జరుగుతుండగా ఎంట్రీ ఇచ్చిన అమ్మాయి.. ఆ అబ్బాయి నన్ను ప్రేమించాడు. ఇప్పుడు ప్రేమించిన నన్ను కాకుండా వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడు అంటూ గొడవ చేసింది. దాంతో పంచాయితీ కాస్తా పోలీస్ స్టేషన్‌కు చేరుకోగా.. పోలీస్ స్టేషన్‌లో యువతి అబ్బాయి ప్రేమించినట్లుగా ఆధారాలు చూపలేకపోయింది. దీంతో చివరకు అమ్మాయి వెళ్లిపోవలసి వచ్చింది.



హమ్మయ్యా గడవ సర్దుమణిగింది అనుకుని మళ్లీ పెళ్లికి సిద్ధం అయ్యేలోగా.. అప్పుడు అధి‌కా‌రులు ఎంట్రీ ఇచ్చి వధువు మైనర్‌ అంటూ బాంబ్‌ పేల్చేశారు. దాంతో జరు‌గా‌ల్సిన పెళ్లి మళ్లీ ఆగిపోయింది. సికింద్రబాద్ చర్చిలో ట్విస్టుల మీద ట్విస్టు‌లతో జరిగిన తతంగంలో క్లైమాక్స్‌లో మాత్రం పెళ్లి ఆగిపోయింది. యువతి బంధు‌వు‌లకు, వరుడి తల్లి‌దం‌డ్రు‌లకు పోలీ‌సులు కౌన్సె‌లింగ్‌ ఇచ్చి బాలల హక్కుల సంఘం ప్రతి‌ని‌ధులు వధు‌వును తీసు‌కెళ్లారు. రెండు కుటుంబాలపై కేసు నమోదు చేస్తామంటూ వారు వెల్లడించారు.