BRS Protest : ఎమ్మెల్సీ కవితపై బండి సంజయ్ వివాదాస్పద వ్యాఖ్యలు.. బీఆర్ఎస్ శ్రేణుల నిరసనలు

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై బీజేపీ తెలంగాణ అధ్యక్షులు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేపట్టారు. బండి సంజయ్ వ్యాఖ్యలకు వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమాలు చేపట్టారు.

BRS Protest : ఎమ్మెల్సీ కవితపై బండి సంజయ్ వివాదాస్పద వ్యాఖ్యలు.. బీఆర్ఎస్ శ్రేణుల నిరసనలు

BRS protest

BRS Protest : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై బీజేపీ తెలంగాణ అధ్యక్షులు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేపట్టారు. బండి సంజయ్ వ్యాఖ్యలకు వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఢిల్లీ, తెలంగాణలో బండి సంజయ్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. బండి సంజయ్, బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బండి సంజయ్ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు. బండి సంజయ్ వెంటనే క్షమాపణలు చెప్పాలని మంత్రులు, బీఆర్ఎస్ శ్రేణులు డిమాండ్ చేశారు.

మహిళా దినోత్సవం రోజున కవిత బండి సంజయ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆమెను కించపరిచేలా ఉన్నాయని విమర్శలు వెల్లువెత్తాయి. అవినీతి పరులందరూ పెవిలియన్ బాట పడతారని హెచ్చరించారు. అవినీతిపరులను విచిచిపెట్టే ప్రసక్తే లేదన్నారు. కవిత దొంగ దందా చేస్తున్నారని దేశం అంతా అంటున్నారని పేర్కొన్నారు. కవిత కారణంగా మహిళలు తల దించుకునే పరిస్థితి వచ్చిందన్నారు. కవితపై బండి సంజయ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కవిత అరెస్టుకు సంబంధించి విలేకరలు అడిగిన ప్రశ్నలకు స్పందిస్తూ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి.

Bandi Sanjay Comments: మహిళల్ని అవమానించిన బండి సంజయ్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి.. బీఆర్ఎస్ మహిళా మంత్రుల డిమాండ్

బండి సంజయ్ కవితపై చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ మంత్రులు ఖండించారు. మహిళలను అవమానించిన బండి సంజయ్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని తెలంగాణ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి డిమాండ్ చేశారు. బీజేపీ ఎందుకు మహిళా గోస పేరుతో నిరసన చేపట్టిందనేది వారికే తెలియదన్నారు. బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు ఆయన దేశంలోని మహిళలందరికీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాజకీయాల్లో మాట్లాడే సందర్భాల్లో పద్ధతి, గౌరవం ఉండాలని చెప్పారు. ఎప్పుడు మాట్లాడినా కేసీఆర్ ను, ఆయన కుటుంబ సభ్యులను వ్యక్తిగతంగా దూషించడం తప్ప చేసిందేమైనా ఉందా? అని ప్రశ్నించారు.

సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడయ్యాక రాష్ట్రంలో రాజకీయ విలువలు పడిపోయాయని తెలంగాణ మంత్రి సత్యవతి రాథోడ్ విమర్శించారు. సభ్య సమాజం తలదించుకునేలా ఆయన మాటలు ఉన్నాయన్నారు. ఆ వ్యాఖ్యలు బండి సంజయ్ వ్యక్తిగతమా లేక పార్టీ వైఖరి కూడా అదేనా అన్నది స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. మహిళా రిజర్వేషన్ల బిల్లు కోసం దీక్ష చేస్తే ఈడి నోటీసులు ఇస్తుందన్నారు. తెలంగాణలో మహిళలకు 33% కాదు, 50% రిజ్వేషన్లు అమలు చేస్తున్నామని తెలిపారు.

Bandi Sanjay Comments: బండి సంజయ్ వ్యాఖ్యలపై మహిళా కమిషన్ ఆగ్రహం.. పోలీస్ కేసు నమోదు

బీజేపీలో ఉన్న దొంగల మీద ఎన్ని ఈడీ కేసులు పెట్టారని ప్రశ్నించారు. మీకు ఎదురు తిరిగితే ఈడిని వేట కుక్కల్లా ఉసిగొల్పుతున్నారని మండిపడ్డారు. వ్యాపారం చేసుకునే తమ ఎంపీలు, మంత్రులు, కవిత మీద కేసులు పెట్టారని.. ఈ కేసులకు భయపడబోమని తేల్చి చెప్పారు. బండి సంజయ్, నీకు, నీ పార్టీకి డిపాజిట్లు కూడా దక్కవని ఎద్దేవా చేశారు. బీజేపీ తన రాజకీయ ఔన్నత్యాన్ని చాటుకోవాలంటే సంజయ్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి, బహిష్కరించాలని డిమాండ్ చేశారు.