BJP MP Laxman: బీఆర్ఎస్ ప్రభుత్వం లీకుల ప్రభుత్వంగా మారింది.. సిట్ విచారణపై నమ్మకం లేదు: బీజేపీ ఎంపీ లక్ష్మణ్

బీఆర్ఎస్ ప్రభుత్వం లీకుల ప్రభుత్వంగా మారింది. టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీకేజీపై విచారణ జరిపించాలి. ప్రశ్నాపత్రాల లీకేజీనీ బీజేపీ ఖండిస్తోంది. జాబ్ నోటిఫికేషన్లపై ఎన్నో సంవత్సరాలుగా వేచి చూస్తున్న యువత ఆశలపై నీళ్ళు పోశారు. సిట్ విచారణ అంటేనే సమ్మకం కుదరడం లేదు. 

BJP MP Laxman: బీఆర్ఎస్ ప్రభుత్వం లీకుల ప్రభుత్వంగా మారింది.. సిట్ విచారణపై నమ్మకం లేదు: బీజేపీ ఎంపీ లక్ష్మణ్

BJP MP Laxman

BJP MP Laxman: తెలంగాణలోని బీఆర్ఎస్ ప్రభుత్వం లీకుల ప్రభుత్వంగా మారిందని విమర్శించారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. యువత బతుకుల్ని ప్రభుత్వం ఆగం చేసిందన్నారు. టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీకేజీ అంశంపై ఎంపీ లక్ష్మణ్ గురువారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రభుత్వంపై విమర్శలు చేశారు.

MLC Kavitha: ఎమ్మెల్సీ కవితకు ఈడీ మరోసారి నోటీసులు.. ఈ నెల 20న విచారణకు హాజరు కావాలని ఆదేశం

‘‘బీఆర్ఎస్ ప్రభుత్వం లీకుల ప్రభుత్వంగా మారింది. టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీకేజీపై విచారణ జరిపించాలి. ప్రశ్నాపత్రాల లీకేజీనీ బీజేపీ ఖండిస్తోంది. జాబ్ నోటిఫికేషన్లపై ఎన్నో సంవత్సరాలుగా వేచి చూస్తున్న యువత ఆశలపై నీళ్ళు పోశారు. సిట్ విచారణ అంటేనే సమ్మకం కుదరడం లేదు. అనేక కేసుల్లో సిట్ విచారణ వేగవంతంగా జరగలేదు. నయీమ్ కేసు నుంచి మొన్నటి డ్రగ్స్ కేసు వరకు, అవినీతి కేసులను మూసివేసే దాంట్లో రాష్ట్ర ఏసీబీకి దేశంలోనే గొప్ప పేరు ఉంది. కేసీఆర్ కనుసన్నల్లో కేసుల విచారణ జరుగుతోంది. గతంలో కూడా అనేక సార్లు పేపర్ లీకేజీలు జరిగాయి. 26 మంది ఇంటర్మీడియట్ విద్యార్థుల ఆత్మహత్యలకు ప్రభుత్వమే కారణం.

Bandi Sanjay: పేపర్ లీకేజీ వ్యవహారంలో కేటీఆర్ రాజీనామా చేయాలి.. కేసీఆర్ బిడ్డకు జైలు రెడీ అవుతోంది: బండి సంజయ్

ఉస్మానియా యూనివర్సిటీ మరోసారి ఉద్యమాలకు వేదికగా మారబోతుంది. లిక్కర్ కేసులో నోటీసులు జారీ చేసినప్పుడు విచారణకు సహకరిస్తామని కవిత చెప్పారు. విచారణ ఎదుర్కొని నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలి. అయితే, తప్పించుకునేందుకు చేస్తున్న మార్గాల్ని ప్రజలు గమనిస్తున్నారు. తప్పు చేసిన వాళ్లే తప్పించుకొనేందుకు మార్గాలు వెతుకుతారు. తప్పు చేయనప్పుడు విచారణకు భయపడాల్సిన అవసరం లేదు. గతంలో అనేకమంది రాజకీయ నాయకులు, ముఖ్యమంత్రులు కూడా ఈడీ విచారణ ఎదుర్కొన్నారు’’ అని లక్ష్మణ్ వ్యాఖ్యానించారు.