Telangana Budget 2023-24 : రైతన్నలకు శుభవార్త..రుణమాఫీ పథకానికి రూ. 6,385 కోట్లు,రైతుబంధుకు రూ. 1575 కోట్లు..
తెలంగాణ వ్యవసాయం రంగం యావత్ భారతదేశానికే ఆదర్శంగా నిలిచిందని..వ్యవసాయ రంగానికి జవజీవాలు అందింటంలో ప్రభుత్వం సఫలీకృతం అయ్యిందని రైతుల కష్టాలను అర్థం చేసుకున్న సీఎం కేసీఆర్ రైతన్నలకు అండగా నిలబడ్డారని బడ్జట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి హరీశ్ రావు తెలిపారు. అందుకే రైతుల రుణమాఫీ పథకానికి రూ. 6,385 కోట్లు కేటాయించామని ప్రకటించారు.

Telangana Budget 2023-24
Telangana Budget 2023-24 : తెలంగాణ వ్యవసాయం రంగం యావత్ భారతదేశానికే ఆదర్శంగా నిలిచిందని..వ్యవసాయ రంగానికి జవజీవాలు అందింటంలో ప్రభుత్వం సఫలీకృతం అయ్యిందని రైతుల కష్టాలను అర్థం చేసుకున్న సీఎం కేసీఆర్ రైతన్నలకు అండగా నిలబడ్డారని బడ్జట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి హరీశ్ రావు తెలిపారు. అందుకే రైతులు కష్టాల్లో ఉన్నప్పుడు నేనున్నానని భరోసా ఇచ్చేందుకు వారి నష్టాలను పూడ్చేందుకు ప్రభుత్వం ఎప్పుడు ముందుంటుంది అన్నారు. అందుకే రైతుల రుణమాఫీ పథకానికి రూ. 6,385 కోట్లు కేటాయించామని ప్రకటించారు.
అంతేకాదు వ్యవసాయంలో దేశానికి ఆదర్శంగా నిలిచి తెలంగాణ వ్యవసాయ వృద్ధి రేటు దేశ వ్యవసాయ వృద్ధి రేటు కంటే ఎక్కువ అని తెలిపారు. దేశ వ్యవసాయం వృద్ధి రేటు 4 శాతం ఉందని అదే తెలంగాణ వ్యవసాయ వృద్ధి రేటు 7.4 శాతంగా ఉందని తెలిపారు. రుణమాఫీ పథకానికి రూ. 6,385 కోట్లు కేటాయించామని దేశానికి ఆదర్శంగా నిలిచిన రైతుబందు పథకానికి రూ. 1575 కోట్లు కేటాయించామని తెలిపారు. అలాగే రైతుల కోసం నిరంతరం పాటుపడే బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబీమా పథకానికి రూ. 1589 కోట్లు కేటాయించామని తెలిపారు. వ్యవసాయం శాఖకు రూ.26,813 కోట్లు కేటాయించగా ఆయిల్ పామ్ సాగుకు రూ.1000కోట్లు కేటాయించామని తెలిపారు.
రుణమాఫీ పథకానికి 6,385 కోట్లు ..
సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలోని తెలంగాణ ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని తెలిపిన మంత్రి హరీష్ గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా రైతు బంధు, రైతు బీమా, రుణమాఫీ పథకాలతో పాటు 24 గంటల విద్యుత్ అందిస్తూ రైతులకు సీఎం కేసీఆర్ అండగా నిలుస్తున్నారని మంత్రి తెలిపారు.