BRS leaders meet EC: సీఈసీని కలిసిన బీఆర్ఎస్‌ నేతల బృందం.. టీఆర్‌ఎస్‌ పేరు మార్పుపై చేసిన తీర్మానం అందజేత

టీఆర్ఎస్ (తెలంగాణ రాష్ట్ర సమితి) పార్టీ పేరును బీఆర్ఎస్ (భారతీయ రాష్ట్ర సమితి)గా మార్చాలని తాము చేసిన తీర్మానాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి బీఆర్ఎస్ నేతలు అందించారు. సీఈసీని కలిసి బీఆర్ఎస్‌ పేరు మార్పు, పార్టీ రాజ్యాంగంలో సవరణలపై వివరించారు. పార్టీ పేరును మారుస్తూ నిన్న టీఆర్ఎస్ సర్వసభ్య సమావేశంలో తీర్మానం చేయగా, అనంతరం దానిపై సీఎం కేసీఆర్ సంతకం చేసిన విషయం తెలిసిందే.

BRS leaders meet EC: సీఈసీని కలిసిన బీఆర్ఎస్‌ నేతల బృందం.. టీఆర్‌ఎస్‌ పేరు మార్పుపై చేసిన తీర్మానం అందజేత

BRS leaders meet EC: టీఆర్ఎస్ (తెలంగాణ రాష్ట్ర సమితి) పార్టీ పేరును బీఆర్ఎస్ (భారతీయ రాష్ట్ర సమితి)గా మార్చాలని తాము చేసిన తీర్మానాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి బీఆర్ఎస్ నేతలు అందించారు. సీఈసీని కలిసి బీఆర్ఎస్‌ పేరు మార్పు, పార్టీ రాజ్యాంగంలో సవరణలపై వివరించారు. పార్టీ పేరును మారుస్తూ నిన్న టీఆర్ఎస్ సర్వసభ్య సమావేశంలో తీర్మానం చేయగా, అనంతరం దానిపై సీఎం కేసీఆర్ సంతకం చేసిన విషయం తెలిసిందే.

ఆ తీర్మానాన్ని ఆ పార్టీ సీనియర్‌ నేత బి.వినోద్‌ కుమార్‌ బృందం ఢిల్లీకి తీసుకెళ్లింది. పేరు మార్పు తీర్మానాన్ని పరిశీలించి ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయనుంది. మరోవైపు, బీఆర్ఎస్ లో భాగంగా దేశంలోని పలు రాష్ట్రాల్లో దాని అనుబంధ సంఘాలను ఏర్పాటు చేయాలని ఆ పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

మొదట రైతుల నేతలతో కలిసి కిసాన్‌ సంఘ్‌ ఏర్పాటు చేస్తారు. తెలంగాణ మోడల్ ను ఆయా రాష్ట్రాల్లో టీఆర్ఎస్ అనుబంధ సంఘాలు వివరించనున్నాయి. తెలంగాణలో అమలువుతున్న రైతుబంధు, రైతు బీమా, 24 గంటల విద్యుత్‌, మిషన్‌ భగీరథ, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌, కేసీఆర్‌ కిట్లు, తాజాగా ప్రవేశపెట్టిన దళితబంధుపైనే బీఆర్ఎస్ ఆధారపడనుంది. 2024 లోక్‌స‌భ ఎన్నిక‌లే ల‌క్ష్యంగా బీఆర్ఎస్ నేతలు ప్ర‌ణాళిక‌లు వేసుకుంటున్నారు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..