MLA Durgam Chinnaiah: బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య లైంగిక వేధింపులకు గురిచేశారని విషం తాగిన యువతి
ఆమెను వెంటనే ఆర్ఎంఎల్ ఆసుపత్రికి తరలించారు.

BRS MLA Durgam Chinnaiah
MLA Durgam Chinnaiah – BRS: ఢిల్లీ (Delhi) లోని తెలంగాణ భవన్(Telangana Bhavan)లో కలకలం చెలరేగింది. బెల్లంపల్లి ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత దుర్గం చిన్నయ్య తనను లైంగిక వేధింపులకు గురిచేశారని ఆరోపిస్తున్న ఓ యువతి ఆత్మహత్యాయత్నం చేసింది. తెలంగాణ భవన్ పార్కింగ్ ఏరియాలో ఆమె విషం తాగింది.
ఆమెను వెంటనే ఆర్ఎంఎల్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో ఆమెకు చికిత్స కొనసాగుతోందని వైద్యులు చెప్పారు. దుర్గం చిన్నయ్య తనపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఓ యువతి కొంత కాలంగా ఆరోపిస్తోంది. ఆయనపై చర్యలు తీసుకోవాలని ఇప్పటికే జాతీయ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేసింది.
అంతేగాక, దుర్గం చిన్నయ్య వల్ల తనకు ప్రాణ హాని ఉందని కూడా బాధితురాలు చెప్పింది. ఎమ్మెల్యేపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరింది. తమపై ఆయన ఇప్పటికే తప్పుడు కేసులు పెట్టించారని ఆరోపణలు చేసింది. తమను కొంత కాలంగా బెదిరిస్తున్నారని తెలిపింది. తాము పోలీసులకు ఫిర్యాదులు చేసినప్పటికీ పట్టించుకోవడం లేదని ఆరోపించింది. ఢిల్లీలోని తెలంగాణ భవన్ వద్ద ఆ యువతి విషయం తాగడంతో మరోసారి ఈ వివాదం తెరపైకి వచ్చింది.
5 రోజులుగా ఢిల్లీలోనే
దుర్గం చిన్నయ్య బాధితురాలు 5 రోజులుగా ఢిల్లీలోనే ఉంది. జాతీయ మహిళా కమిషన్, జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేసిన అనంతరం ఢిల్లీ తెలంగాణ భవన్, ఇండియా గేట్, జంతర్ మంతర్ వద్ద నిరసన వ్యక్తం చేసింది. తెలంగాణలో న్యాయం జరగడం లేదు కాబట్టే ఢిల్లీ వరకు వచ్చానని చెప్పింది. తెలంగాణ మంత్రి కేటీఆర్ అపాయింట్‌మెంట్ కోరినా పట్టించుకోవడం లేదని వివరించింది. తెలంగాణ భవన్ లోని అంబేడ్కర్ విగ్రహానికి ఆమె వినతి పత్రం ఇచ్చింది.
Wrestlers Protest: బల ప్రదర్శనపై వెనక్కి తగ్గిన బ్రిజ్ భూషణ్.. ఎందుకంటే?