K.Kavitha hunger strike LiveUpdates In Telugu: కవిత దీక్ష విరమణ.. మహిళా రిజర్వేషన్లను సమర్థిస్తూ పలువురు సంతకాలు

పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేపట్టిన దీక్ష కొనసాగుతోంది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద, భారత జాగృతి ఆధ్వర్యంలో కవిత చేపట్టిన ఈ దీక్షకు బీఆర్ఎస్ ఎంపీలు, తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు.

K.Kavitha hunger strike LiveUpdates In Telugu: కవిత దీక్ష విరమణ.. మహిళా రిజర్వేషన్లను సమర్థిస్తూ పలువురు సంతకాలు

K.Kavitha hunger strike LiveUpdates In Telugu

K.Kavitha hunger strike LiveUpdates In Telugu: పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేపట్టిన దీక్ష ముగిసింది. శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద, భారత జాగృతి ఆధ్వర్యంలో సాయంత్రం 4 గంటల వరకు ఈ దీక్ష కొనసాగింది.

The liveblog has ended.

LIVE NEWS & UPDATES

  • 10 Mar 2023 04:51 PM (IST)

    భవిష్యత్తులోనూ పోరాడతాం: ఎమ్మెల్సీ కవిత

    భవిష్యత్తులోనూ మహిళా రిజర్వేషన్ల కోసం పోరాడతామని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. ఎన్నికలకు ముందు మరో రెండు పార్లమెంట్ సెషన్స్ మాత్రమే ఉన్నాయని, ఇప్పుడే మహిళా బిల్లును ఆమోదింపజేసుకోవలని చెప్పారు. ఇప్పుడే మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందుతుందని భావిస్తున్నానని అన్నారు.

     K.Kavitha hunger strike

    K.Kavitha hunger strike

  • 10 Mar 2023 04:27 PM (IST)

    మహిళా రిజర్వేషన్లను సమర్థిస్తూ సంతకాలు: కవిత

    మహిళా రిజర్వేషన్ కోసం తన దీక్షకు మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు చెబుతున్నానని ఎమ్మెల్సీ కవిత అన్నారు. తన దీక్ష ముగిశాక మాట్లాడారు. మహిళా రిజర్వేషన్లను సమర్థిస్తూ పలువురు సంతకాలు చేశారని చెప్పారు.

  • 10 Mar 2023 04:12 PM (IST)

    ముగిసిన దీక్ష

    పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేపట్టిన దీక్ష ముగిసింది. శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద, భారత జాగృతి ఆధ్వర్యంలో సాయంత్రం 4 గంటల వరకు ఈ దీక్ష కొనసాగింది.

  • 10 Mar 2023 03:47 PM (IST)

    దీక్షకు మద్దతు

    దీక్షలో పలు పార్టీల మహిళా నేతలు, పలు సంఘాల వారు పాల్గొన్నారు. వారికి కవిత కృతజ్ఞతలు తెలిపారు.

  • 10 Mar 2023 12:02 PM (IST)

    దీక్షకు హాజరైన మంత్రులు సబిత, సత్యవతి రాథోడ్

    ఎమ్మెల్సీ కవిత చేపట్టిన దీక్షకు బీఆర్ఎస్ తెలంగాణ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే పద్మాదేవెందర్ రెడ్డి, ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, వెంకటేశ్ నేతతోపాటు పలువురు నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు.

  • 10 Mar 2023 11:37 AM (IST)

    మహిళా బిల్లుకు పూర్తి మద్దుతు: సీతారాం ఏచూరి

    మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందే వరకు పోరాటం కొనసాగుతుందన్నారు సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి. ‘‘భారత జాగృతి సంస్థకు అండగా ఉంటాం. మూడు దశాబ్దాలుగా మహిళా రిజర్వేషన్లపై చర్చ జరగకపోవడం బాధాకరం. సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో మహిళలు వెనుకబడ్డారు. బిల్లు రాజ్యసభలో ఆమోదం పొంది, లోక్‌సభలో పెండింగ్‌లో ఉండిపోయింది. ఈ బిల్లుకు సీపీఎం పూర్తి మద్దతు ఇస్తుంది’’ అని సీతారాం ఏచూరి అన్నారు.

  • 10 Mar 2023 11:31 AM (IST)

    బీజేపీ తన హామీని నిలబెట్టుకోవాలి: ఎమ్మెల్సీ కవిత

    ‘‘1996లో దేవేగౌడ హయాంలో మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టినా చట్టం కాలేదు. 27 ఏళ్లుగా బిల్లు పెండింగ్‌లో ఉంది. బీజేపీ రెండుసార్లు హామీ ఇచ్చింది. బీజేపీ తన హామీని కార్యరూపంలోకి తేవాలి. మహిళలు ఆకాశంలో సగం.. అవకాశాల్లో సగం కావాలి. రాజకీయాల్లో మహిళలకు సముచిత స్థానం దక్కాలి. మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందే వరకు పోరాటం కొనసాగుతుంది’’ అని కవిత వ్యాఖ్యానించారు

  • 10 Mar 2023 10:47 AM (IST)

    కవిత దీక్షకు 18 పార్టీల సంఘీభావం.. సీతారాం ఏచూరి హాజరు

    మహిళా రిజర్వేషన్ల కోసం ఎమ్మెల్సీ కవిత చేపట్టిన దీక్షకు 18 పార్టీలు సంఘీభావం ప్రకటించాయి. ఇప్పటికే కవిత తన మద్దతుదారులతో దీక్ష ప్రారంభించారు. దీక్షా స్థలికి కమ్యూనిస్టు పార్టీ సీనియర్ లీడర్ సీతారాం ఏచూరి హాజరయ్యారు. కవితకు సంఘీభావం ప్రకటించారు.