Delhi Liquor Scam : మరోసారి ఈడీ విచారణకు కవిత..మంత్రులు, ఎమ్మెల్యేలు సహా అంతా ఢిల్లీలోనే.. అరెస్ట్ చేస్తే ఆందోళనకు రెడీగా ఉన్న గులాబీ దళం

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మరోసారి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈరోజు విచారణకు హాజరుకానున్నారు. దీంతో ఆమెకు మద్దతులు గులాబీ నేతలంతా హైదరాబాద్ నుంచి ఢిల్లీకి తరలివెళ్లారు. మంత్రులు, ఎమ్మెల్యేలు సహా ఢిల్లీకి చేరుకున్నారు. వీరిలో మంత్రులు కవితకు అన్న కేటీఆర్, మేనమామ హరీశ్ రావులు కూడా ఉన్నారు.

Delhi Liquor Scam : మరోసారి ఈడీ విచారణకు కవిత..మంత్రులు, ఎమ్మెల్యేలు సహా అంతా ఢిల్లీలోనే.. అరెస్ట్ చేస్తే ఆందోళనకు రెడీగా ఉన్న గులాబీ దళం

Delhi Liquor Scam kavitha

Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మరోసారి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈరోజు విచారణకు హాజరుకానున్నారు. దీంతో ఆమెకు మద్దతులు గులాబీ నేతలంతా హైదరాబాద్ నుంచి ఢిల్లీకి తరలివెళ్లారు. మంత్రులు, ఎమ్మెల్యేలు సహా ఢిల్లీకి చేరుకున్నారు. వీరిలో మంత్రులు కవితకు అన్న కేటీఆర్, మేనమామ హరీశ్ రావులు కూడా ఉన్నారు. ఇప్పటి వరకు లిక్కర్ స్కామ్ లో ఈడీ దాదాపు 12మందిని అరెస్ట్ చేసి విచారించింది. విచారణ కొనసాగిస్తోంది. కానీ ఈడీ విచారణకు వీరిలో ఎవరు హాజరైనా ఇంత హడావిడి..హల్ చల్ లేదు. కానీ కవిత ఈడీ విచారణకు హాజరవుతోంది అంటే మాత్రం మొత్తం తెలంగాణాయే కదిలి వెళ్లేలా గులాబీ బాస్ లు హంగామా క్రియేట్ చేస్తున్నారు. లిక్కర్ స్కామ్ లో కవితపై ఉన్న కేవలం ఆరోపణలు మాత్రమే అవి నిజంకాదు అనేలా గులాబీ పటాలం హడావిడి కొనసాగుతోంది.

Delhi Liquor Scam MLC kavitha : తండ్రి కేసీఆర్ లక్కీ నంబర్ ‘6’ తోనే ఈడీ విచారణకు వెళ్లిన ఎమ్మెల్సీ కవిత

ఈక్రమంలో ఈరోజు కవిత మరోసారి ఈడీ విచారణకు హాజరుకానున్న క్రమంలో తెలంగాణ నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు భారీగా గులాబీ నేతలు ఢిల్లీకి తరలివెళ్లారు. దీంతో ఢిల్లీలోని సీఎం కేసీఆర్ నివాసం వద్ద ఢిల్లీ పోలీసులు 144 సెక్షన్ విధించారు. మార్చి 11న కవిత ఈడీ విచారణకు వెళ్లిన సమయంలో ఎంత హంగామా జరిగిందో తెలిసిందే. కాన్వాయ్ లో కవిత ఈడీ విచారణ హాజరుకావటం లోపలికి వెళుతూ గులాబీ శ్రేణులకు పిడికిలి బిగించి అభివాదం చేయటం వంటి దృశ్యాలు హల్ చల్ చేశాయి. ఆ సమయంలో కూడా తనసోదరికి మద్దతుగా మంత్రి కేటీఆర్ ఢిల్లీలోనే మకాం వేశారు.

విచారణ తరువాత కవితను ఈడీ అరెస్ట్ చేస్తుందనే పరిస్థితులు నెలకొన్న సందర్భంగా ఆమె అరెస్ట్ అయితే ఢిల్లీలో ఆందోళనలు చేయటానికి గులాబీ దళం సిద్ధమైంది. కానీ కవితను ఈడీ అరెస్ట్ చేయలేదు. మరోసారి విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. దీంతో కవిత ఈరోజు మరోసారి ఢిల్లీఈడీ కార్యాలయంలో విచారణకు హాజరుకానున్నారు. దీంతో మరోసారి గులాబీ పటాలం అంతా ఢిల్లీ చేరుకుంది. ఈసారి కవితను అరెస్ట్ చేసే పరిస్థితి వస్తే ఆందోళనలు చేయటానికి గులాబీ దండు సిద్ధంగా ఉందని సమాచారం.

Delhi Liquor Scam : కవితను జైల్లో వేయాలంటే ఈడీకి ఇంత టైమా?పేరంటానికి పిలిచారా?ఇదంతా బీఆర్ఎస్,బీజేపీ డ్రామాలు : రేవంత్ రెడ్డి

మార్చి 11న కవితపై ఈడీ అధికారుల బృందం ప్రశ్నల వర్షం కురిపించింది. ముఖ్యంగా 2021-2022 మధ్య కవిత దాదాపు 10 స్మార్ట్ ఫోన్లు ధ్వంసం చేయటం వంటి అంశాలపై దృష్టి పెట్టింది. అలాగే కవిత బినామీని అని అరుణ్ రామచంద్ర పిళ్లై ఈడీ విచారణ వెల్లడించటంపై కూడా కవితపై ఈడీ ప్రశ్నలు సంధించింది. ఈక్రమంలో కవిత ఫోన్ ను స్వాధీనంచేసుకుంది. ఈడీ విచారణకు వెళ్లిన కవిత ప్రస్తుతం తను వాడే ఫోన్ పట్టుకెళ్లకుండానే వెళ్లారు. దీంతో ఈడీ అధికారులు ఫోన్ తెప్పించుకుని మరీ ఆ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు.