Vivek Venkataswamy: మనీష్ సిసోడియా తరహాలోనే త్వరలో ఎమ్మెల్సీ కవిత అరెస్టు: మాజీ ఎంపీ వివేక్

ఢిల్లీ లిక్కర్ స్కాంలో మనీష్ సిసోడియా తరహాలోనే ఎమ్మెల్సీ కవిత కూడా త్వరలోనే జైలుకు వెళ్తారని అభిప్రాయపడ్డారు మాజీ ఎంపీ వివేక్. తెలంగాణలో ఉన్న వ్యతిరేకతను డైవర్ట్ చేయడానికే బీఆర్ఎస్ అంటూ కేసీఆర్ కేంద్రంలో తిరుగుతున్నారని విమర్శించారు. సోమవారం ఆయన తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

Vivek Venkataswamy: ఢిల్లీ లిక్కర్ స్కాంలో మనీష్ సిసోడియా తరహాలోనే ఎమ్మెల్సీ కవిత కూడా త్వరలోనే జైలుకు వెళ్తారని అభిప్రాయపడ్డారు మాజీ ఎంపీ వివేక్. ఈ కేసులో కవిత అరెస్టు తప్పదన్నారు. సోమవారం ఆయన తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

Ayyanna Patrudu: సుప్రీం కోర్టులో టీడీపీ నేత అయ్యన్న పాత్రుడుకు ఎదురుదెబ్బ.. ఫోర్జరీ కేసు విచారణకు అనుమతి

ఈ సందర్భంగా బీఆర్ఎస్, కేసీఆర్‌పై విమర్శలు చేశారు. ‘‘ఢిల్లీ లిక్కర్ స్కాంలో మనీష్ సిసోడియా తరహాలోనే కవిత కూడా త్వరలోనే జైలుకు వెళ్తారు. లిక్కర్ కుంభకోణంలో రూ.150 కోట్లు ఆప్ ప్రభుత్వానికి ఇచ్చారు. లిక్కర్ స్కాంలో కేంద్రం మరింత మందిని అరెస్టు చేసే అవకాశం ఉంది. తెలంగాణలో ఉన్న వ్యతిరేకతను డైవర్ట్ చేయడానికే బీఆర్ఎస్ అంటూ కేసీఆర్ కేంద్రంలో తిరుగుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలోనే కనుమరుగవుతుంది. తెలంగాణలో సంపాదించిన అవినీతి సొమ్మును ఇతర రాష్ట్రాల్లో బీఆర్ఎస్ అంటూ ఖర్చు పెడుతున్నారు. టీఆర్ఎస్ ఏర్పడినప్పుడు పార్టీకి నిధులు లేవు. ప్రస్తుతం దేశంలో అన్ని పార్టీలకన్నా ధనిక పార్టీ బీఆర్ఎస్. మరి పార్టీకి ఇప్పుడు నిధులు ఎక్కడి నుంచి వచ్చాయి. ఇవన్నీ ప్రజల సొమ్మే.

Dangerous Man: ముంబైలో అడుగుపెట్టిన ‘కిరాతకుడు’.. అప్రమత్తంగా ఉండాలంటూ ఎన్ఐఏ హెచ్చరిక

బీఆర్ఎస్ పార్టీ వాళ్లు రూ.400 కోట్లతో విమానం కూడా కొన్నారు. తెలంగాణ ఖజానా దోచుకుని ముఖ్యమంత్రి ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, నిరుద్యోగ భృతి, ఇంటికొక ఉద్యోగం, రుణ మాఫీ ఏమైందని ప్రజలు అడుగుతున్నారు. మేఘా కృష్ణా రెడ్డి లాంటి కాంట్రాక్టర్లను ప్రపంచంలోనే ధనికులను చేసిన ఘనత ముఖ్యమంత్రికి దక్కుతుంది. ఇతర రాష్ట్రాల్లో కాలం చెల్లిన నేతలు కాసులకు కక్కుర్తి పడి బీఆర్ఎస్‌లో చేరుతున్నారు’’ అని వివేక్ వ్యాఖ్యానించారు.

 

ట్రెండింగ్ వార్తలు