Telangana Assembly : అసెంబ్లీలో BRS Vs MIM.. అక్బరుద్దీన్, కేటీఆర్ మధ్య మాటల యుద్ధం

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ఆసక్తికర ఘటన జరిగింది. మిత్రపక్షాలు అనుకునే పార్టీల మధ్య మాటల తూటాలు పేలాయి. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ, మంత్రి కేటీఆర్ మధ్య మాటల యుద్ధం నడిచింది.

Telangana Assembly : అసెంబ్లీలో BRS Vs MIM.. అక్బరుద్దీన్, కేటీఆర్ మధ్య మాటల యుద్ధం

BRS Vs MIM : బీఆర్ఎస్-ఎంఐఎం మధ్య చక్కటి సత్సంబంధాలు ఉండేవి. ఎంఐఎం చెప్పినట్లే సీఎం కేసీఆర్ వ్యవహరిస్తారనే ఆరోపణలు ఉన్నాయి. కానీ దీనికి భిన్నంగా అసెంబ్లీ సమావేశాల్లో ఘటన ఒకటి ఆసక్తికరంగా మారింది. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ, మంత్రి కేటీఆర్ మధ్య మాటల యుద్ధం నడిచింది. గవర్నర్ పై ధన్యవాద తీర్మానం సందర్భంగా అక్బరుద్ధీన్, కేటీఆర్ మధ్య మాటల యుద్ధం జరిగింది. అసెంబ్లీలో హామిలు ఇస్తారు కానీ వాటిని అమలు చేయరు అంటూ అక్బరుద్ధీన్ విమర్శించారు. సీఎం గానీ, మంత్రులు గానీ మమ్మల్ని కలవరు బీఏసీలో ఇష్టమొచ్చినట్లుగా నిర్ణయాలు తీసుకుంటారని 25 ఏళ్లలో ఇటువంటి సభను చూడలేదంటూ అక్బరుద్ధీన్ విమర్శించారు. ఇక పాతబస్తీకి మెట్రో సంగతేంటి?. ఉస్మానియా ఆసుపత్రి పరిస్థితి ఏంటని అక్బరుద్దీన్ అంటూ ప్రశ్నించారు. అక్బరుద్ధీన్ విమర్శలకు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. ఎంఐఎంకు ఉన్నది ఏడుగురు ఎమ్మెల్యేలు. మరి ఎంత సమయం ఇస్తారు? అంటూ ప్రశ్నించారు.ఏడుగురు సభ్యులున్న పార్టీకి ఎక్కువ సమయం కేటాయించడం సరికాదన్నారు కేటీఆర్.

కాగా తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ కు ఎంఐఎంకు మధ్య మంచి సంబంధాలున్నాయి. కానీ ఇటీవల కాలంలో ఈ రెండు పార్టీలకు చెడిందనే వార్తలు వచ్చాయి. ముఖ్యంగా టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారాక ప్రభుత్వ తీరు మారిందనేలా ఉంది. జాతీయ రాజకీయాల్లోనూ కీలకంగా ఉండాలనే ఉద్ధేశంతో టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా రూపాంతరం చేశారు సీఎం కేసీఆర్.ఈ క్రమంలో ఎంఐఎంతో టీఆర్ఎస్ కాస్త దూరంగా ఉంటుందనేది స్పష్టమవుతోంది. కొత్త మిత్రులకు దగ్గరవుతున్న క్రమంలో పాత మిత్రులకు టీఆర్ఎస్ దూరమవుతోందనే వాదనలు వినిపిస్తున్నాయి.

జాతీయ స్థాయిలో సమాజ్‌వాదీ పార్టీ, జనతాదళ్ పార్టీలకు కేసీఆర్ దగ్గరవుతున్నారు. ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయ ప్రారంభోత్సవానికి యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి హాజరయ్యారు. కానీ ఈ కార్యక్రమానికి కేసీఆర్ పాత మిత్రుడు ఎంఐఎం అసదుద్దీన్ ఒవైసీ మాత్రం ఎక్కడా కనిపించలేదు. టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీల మధ్య చాలా కాలంగా ఉన్న దోస్తీ మసకబారుతోందా? అనిపించేలా ఉంది. టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్‌గా ఆవిర్భవించాక.. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీకి సీఎం కేసీఆర్ కు మధ్య గ్యాప్ పెరిగినట్లుగాను..పెరుగుతున్నట్లుగా అనిపిస్తోంది తాజాగా అసెంబ్లీ వేదికగా జరిగిన ఈ విమర్శలు ప్రతి విమర్శల తీరు చూస్తుంటే..