RS Praveen Kumar : మెడికో విద్యార్థి ప్రీతికి మెరుగైన వైద్యం అందించాలి: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

మెడికో విద్యార్థి ప్రీతికి మెరుగైన వైద్యం అందించాల్సిన అవసరం ఉందని బీఎస్పీ నేత ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ అన్నారు. పేద వర్గం నుంచి వచ్చిన ప్రీతి చాలా కష్టపడి చదివిందని చెప్పారు.

RS Praveen Kumar : మెడికో విద్యార్థి ప్రీతికి మెరుగైన వైద్యం అందించాలి: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

RS.Praveen Kumar

RS Praveen Kumar : మెడికో విద్యార్థి ప్రీతికి మెరుగైన వైద్యం అందించాల్సిన అవసరం ఉందని బీఎస్పీ నేత ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ అన్నారు. పేద వర్గం నుంచి వచ్చిన ప్రీతి చాలా కష్టపడి చదివిందని చెప్పారు. లంబాడా కులానికి చెందిన ప్రీతి కలను దూరం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మెడికల్ కాలేజీలో పేద వర్గాల వాళ్ళు చదవకూడదా? డాక్టర్స్ అవ్వవద్దా? అని ప్రశ్నించారు.

బడుగు బలహీనర్గాలకు చెందిన వాళ్ళు డాక్టర్స్ అవ్వొద్దా? అని నిలదీశారు. కొన్ని పార్టీలు రాజకీయ రంగు పులుముతున్నాయని విమర్శించారు. లవ్ జిహాద్ అని అనడం కరెక్ట్ కాదన్నారు. బండి సంజయ్ కొడుకు కూడా జూనియర్ ని కొట్టారు.. అప్పుడు మాట్లాడని సంజయ్ ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నాడని ప్రశ్నించారు. ఘటన జరిగిన రోజు 4.30 నుంచి 8 గంటల వరకు ఎం జరిగిందన్న దానిపై పోలీసులు లోతుగా విచారణ చెయాలన్నారు.

Medico Preethi : మెడికో ప్రీతి హెల్త్ బులెటిన్ విడుదల.. నిమ్స్ డాక్టర్లు ఏం చెప్పారంటే

ముందుగా హెచ్ వోడీని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. పీజీ స్థాయిలో కాదు.. ప్రగతి భవన్ లోనే ర్యాగింగ్ ఉందన్నారు. కనిపించని ర్యాగింగ్ ఉంటుందని…బెదిరింపులు ఉన్నాయని పేర్కొన్నారు. ర్యాగింగ్ ఎలా ఉంటుందో.. తాను కూడా చూశానని పేర్కొన్నారు.

మెడికో ధారవత్తు ప్రీతి ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. ఎక్మో వెంటిలేటర్ పై నిమ్స్ డాక్టర్లు వైద్యం అందిస్తున్నారు. నిన్న (శుక్రవారం) ప్రీతికి సీపీఆర్ చేసి గుండె పని తీరును మెరుగుపరిచారు. ప్రీతి ఆరోగ్య పరిస్థితిపై నిమ్స్ ఆసుపత్రి వైద్యులు హెల్త్ బుల్టెన్ ను విడుదల చేశారు.

Medico Preeti Case : వరంగల్ మెడికో ప్రీతి కేసులో నిందితుడు అరెస్టు.. ర్యాగింగ్ తోపాటు ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు

ఎక్మో వెంటిలేటర్ డయాలసిస్ తో మెయింటెన్ చేస్తున్నామని నిమ్స్ సూపరిండెంట్ అన్నారు. అయితే వైద్య బృందం నిషితంగా పర్యవేక్షిస్తుందని చెప్పారు. ప్రీతిని కాపాడేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు.