ఇంటర్ పరీక్ష రాసిన బీటెక్ విద్యార్ధి.. పట్టుకున్న పోలీసులు

  • Published By: vamsi ,Published On : March 14, 2020 / 02:08 AM IST
ఇంటర్ పరీక్ష రాసిన బీటెక్ విద్యార్ధి.. పట్టుకున్న పోలీసులు

చక్కగా చదువుకుని పరీక్షలు రాయాల్సిన విద్యార్ధులు తప్పుడు పని చేస్తూ పట్టుబడ్డారు. ప్రస్తుతం ఇంటర్ పరీక్షలు జరుగుతుండగా.. ఆ పరీక్షలలో ఓ విద్యార్ధి పేపర్‌ను వేరొక బీటెక్ విద్యార్ధి రాస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్‌లోని ఎస్సార్‌నగర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో ఓ ప్రైవేటు కళాశాలకు చెందిన విద్యార్థి అమీర్‌పేట ధరంకరం రోడ్డులోని కేంద్రంలో ఇంటర్‌ పరీక్ష రాయవలసి ఉంది.

Also Read | హైదరాబాద్ లో మరో ఇద్దరికి కరోనా లక్షణాలు

అయితే అతడికి బదులు బీటెక్‌ చదువుతున్న సాయితేజ శుక్రవారం(13 మార్చి 2020) జరిగిన గణితం-2బి పరీక్షకు హాజరై పరీక్షలు రాశాడు. ఇన్విజిలేటర్‌కు అనుమానం రావడంతో హాల్‌టికెట్‌లోని ఫొటోతో పరీక్ష రాస్తున్న విద్యార్థిని పోల్చి చూడగా అసలు విషయం బయటకు వచ్చింది. దీంతో అతనిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

ఇద్దరిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఇద్దరు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. బీటెక్‌ విద్యార్థిపైన చీటింగ్ కేసుతో పాటు పలు సెక్షన్ల కింద కేసులు పెట్టారు.

Also Read | మైక్రోసాఫ్ట్ కు బిల్ గేట్స్ రాజీనామా