Minister Harish Rao : తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్ : మంత్రి హరీష్ రావు
తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్ ఉంటుందని మంత్రి హరీష్ రావు అన్నారు. అభివృద్ధి, సంక్షేమానికి సమ ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు.

_Harish Rao (1)
Minister Harish Rao : తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్ ఉంటుందని మంత్రి హరీష్ రావు అన్నారు. అభివృద్ధి, సంక్షేమానికి సమ ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా బడ్జెట్ ఉంటుందన్నారు. కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా పేదవర్గాలకు అనుకూలంగా బడ్జెట్ ఉంటుందని తెలిపారు. కేంద్రం వివక్షచూపుతున్నా.. తెలంగాణ సొంత కాళ్లపై నిలబడిందని చెప్పారు. కేసీఆర్ ఆలోచనలకనుగుణంగా సంక్షేమం, అభివృద్ధి జోడెడ్ల మాదిరి తెలంగాణ ముందుకు వెళ్తుందని పేర్కొన్నారు. ఇవాళ ఉదయం 10:30 గంటలకు అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. శాసన మండలిలో శాసనసభ వ్యవహారాల మంత్రి ప్రశాంత్ రెడ్డి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.
2023-24 ఆర్థిక సంవత్సారానికి బడ్జెట్ ను ఇవాళ బీఆర్ఎస్ సర్కార్ అసెంబ్లీ ముందు ఉంచనుంది. ఉదయం 10:30 రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. అటు శాసన మండలిలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. నిన్న ప్రగతి భవన్ లో సమావేశమైన కేబినెట్ బడ్జెట్ కు ఆమోదం తెలిపింది. బడ్జెట్ పై కేబినెట్ సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. శాఖలు, పథకాల వారిగా కేటాయింపులను మంత్రులకు వివరించారు. వారు ఇచ్చిన సూచనలు, సలహాల మేరకు బడ్జెట్ కు ఆమోదం తెలిపారు. మంత్రుల సూచనల ఆధారంగా ఆర్థిక శాఖ కేటాయింపుల్లో రాష్ట్ర ప్రభుత్వం కొన్ని మార్పులు, చేర్పులు చేస్తోంది.
శాసన సభకు బడ్జెట్ ను ఇవాళ సమర్పించనుండగా ఈ నెల 8న చర్చ జరుగనుంది. అదే రోజు మంత్రి హరీష్ రావు వివరణ ఇవ్వనున్నారు. ఇక కేంద్ర గ్రాంట్లు, పన్నుల్లో వాటా, రానున్న ఎన్నికలు, కొత్త పథకాలు, పాత పథకాలకు కేటాయింపులు, రాబడులు, వ్యయాల వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ను రూపొందించినట్లు తెలుస్తోంది. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఎవరికి కాదనకుండా, లేదనకుండా బడ్జెట్ ను రూపొందించినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే అమల్లో ఉన్న ప్రతిష్టాత్మక పథకాలకు సరిపడ నిదులను కేటాయంచినట్లు తెలుస్తోంది.