Rajanna-Sircilla: స్కూలు బస్సును ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు.. 20 మంది చిన్నారులకు గాయాలు
రాజన్న సిరిసిల్ల జిల్లాలో స్కూల్ బస్సును వెనుక నుంచి ఢీ కొట్టింది ఆర్టీసీ బస్సు. దీంతో స్కూల్ బస్సులోని 20 మంది చిన్నారులకు గాయాలయ్యాయి. ఎల్లారెడ్డి పేటలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు చిన్నారులను ఆసుపత్రికి తరలించి, చికిత్స అందేలా చేశారు.

Rajanna-Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లాలో స్కూల్ బస్సును వెనుక నుంచి ఢీ కొట్టింది ఆర్టీసీ బస్సు. దీంతో స్కూల్ బస్సులోని 20 మంది చిన్నారులకు గాయాలయ్యాయి. అలాగే, బస్సులోని మరో 10 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఎల్లారెడ్డి పేటలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు చిన్నారులను ఆసుపత్రికి తరలించి, చికిత్స అందేలా చేశారు.
చిన్నారులకు మెరుగైన చికిత్స అందేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రమాద ఘటనపై తెలంగాణ మంత్రి కేటీఆర్ అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. కలెక్టర్ తోనూ ఆయన మాట్లాడి ఆరా తీశారు. ప్రమాదంలో గాయపడిన చిన్నారులకు మెరుగైన వైద్యం అందించాలని చెప్పారు.
ప్రమాద ఘటనతో స్కూలు చిన్నారుల తల్లిదండ్రులు భయాందోళనలకు గురయ్యారు. వారిని చూసేందుకు ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. ప్రమాద ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.