TSRTC : ఫోన్ చేస్తే ఇంటి వద్దకే ఆర్టీసీ బస్సు

ఎలాంటి అదనపు చార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదని ఎండీ సజ్జనార్ తెలిపారు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లోని ప్రయాణికులకు ఈ సదుపాయం కల్పించనున్నట్లు ట్విట్టర్ తెలిపారు.

TSRTC : ఫోన్ చేస్తే ఇంటి వద్దకే ఆర్టీసీ బస్సు

Tsrtc

bus services from home by phone call : టీఎస్ ఆర్టీసీ కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు మీ ఇంటి వద్దకే ఆర్టీసీ బస్సు వస్తోంది. ఒకప్పుడు ప్రయాణికుల సంఖ్యను పెంచుకోవడానికి ప్రయాణికులు కోరిన చోట బస్సును ఆపి ఎక్కించుకోవడం, దించడం చేసిన ఆర్టీసీ మరో అడుగు ముందకు వేసింది. ప్రయాణికుల ఇంటి వద్దనే సేవలందించేదుకు రెడీ అయ్యింది. సంక్రాంతి పండుగకు ఊర్లకు వెళ్లే ప్రయాణికులు ఒకే ప్రాంతంలో 30 మంది ఉంటే వారి ప్రాంతం, వారి కాలనీకి బస్సును పంపిస్తామని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పేర్కొన్నారు.

ఎలాంటి అదనపు చార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదని ఎండీ సజ్జనార్ తెలిపారు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లోని ప్రయాణికులకు ఈ సదుపాయం కల్పించనున్నట్లు ట్విట్టర్ తెలిపారు. సమచారం కోసం ఎంజీబీఎస్ : 9959226257, జేబీఎస్ : 9959226246, రేతిఫైల్ బస్ స్టేషన్ 9959226154, కోఠి బస్ స్టేషన్ : 9959226160 నెంబర్లలో సంప్రదించాలని ఆయన సూచించారు.

Omicron India : దేశంలో భారీగా పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు

ఇప్పటికే టీఎస్ఆర్టీసీ సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రత్యేక బస్సులు నడుపనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. సంక్రాంతి పండుగకు తమ స్వగ్రామాలకు వెళ్లే వారి కోసం టీఎస్‌ ఆర్టీసీ స్పెషల్‌ బస్సులు నడుపుతోంది. జనవరి 7 నుంచే బస్సు సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఈ నెల 15 వరకు స్పెషల్‌ బస్సులను తిప్పనున్నట్టు ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ ప్రకటించారు.

సంక్రాంతి పండుగకు మొత్తం 4వేల 318 బస్సులను టీఎస్‌ ఆర్టీసీ నడపనుంది. సంక్రాంతికి తెలంగాణలోని వివిధ జిల్లాలకు 3వేల 334 స్పెషల్‌ బస్సులను నడపనుంది. ఇక ఏపీకి మరో 984 సర్వీసులు తిప్పనుంది. అయితే ఈసారి చార్జీల విషయంలో ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ కాస్త ఊరట నిచ్చింది. సాధారణ చార్జీలనే వసూలు చేస్తామని తెలిపింది.

Corona Delhi : ఢిల్లీ జైలులో 114, తీహార్ జైలులో 76 మందికి కరోనా

పండుగకు తిప్పే స్పెషల్‌ బస్సుల్లో అదనపు చార్జీలు వసూలు చేయబోమని ప్రకటించింది. సాధారణ చార్జీలనే వసూలు చేయనున్నట్టు వెల్లడించింది. దీంతో ఎక్కువ మంది ఆర్టీసీ బస్సులను ఆశ్రయించే అవకాశముంది. పండుగ కోసం ఊళ్లకు వెళ్లేవారిని తమ బస్సుల్లో ఎక్కించేలా ఆర్టీసీ ప్లాన్‌ చేసింది.

ఏపీకి తిప్పే బస్సుల్లోనూ టీఎస్ఆర్టీసీ సాధారణ చార్జీలే వసూలు చేయనుంది. దీంతో సంక్రాంతి పండుగను కుటుంబంతో జరుపుకోవడానికి సొంతూళ్లకు వెళ్లే ఏపీ ప్రజలు కూడా టీఎస్‌ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే అవకాశముంది. కాగా, సంక్రాంతి పండుగకు అదనపు చార్జీలు వసూలు చేస్తామని ఏపీఎస్‌ ఆర్టీసీ ప్రకటించింది.