Telangana : పొంగులేటి శ్రీనివాసరెడ్డికి టీఆర్ఎస్ నుంచి పిలుపు..‘రాజ్యసభకు పంపుతారా?’..
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి రాజ్యసభ సభ్యుడు (ఎంపీ)గా పదవి దక్కుతుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈక్రమంలో టీఆర్ఎస్ నుంచి పొంగులేటికి టీఆరఎస్ అధిష్టానుంచి పిలుపు అందింది. రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల అయిన క్రమంలో పొంగులేటిని టీఆర్ఎస్ నుంచి రాజ్యసభకు పంపిస్తారా?అనే చర్చ జరుగుతోంది.

Call from TRS to Ponguleti Srinivasareddy..: ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి రాజ్యసభ సభ్యుడు (ఎంపీ)గా పదవి దక్కుతుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈక్రమంలో టీఆర్ఎస్ నుంచి పొంగులేటికి టీఆరఎస్ అధిష్టానుంచి పిలుపు అందింది. రేపు హైదరాబాద్ లో అందుబాటులో ఉండాలంటూ పార్టీ పెద్దలు పొంగులేటికి సూచించారు. రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల అయిన క్రమంలో పొంగులేటిని టీఆర్ఎస్ నుంచి రాజ్యసభకు పంపిస్తారా?అనే చర్చ జరుగుతోంది. రాజ్యసభకు వెళ్లే అవకాశం ఇస్తారా? లేదా ఇవ్వటం కుదరటంలేదని చెప్పి బుజ్జగిస్తారా? అనే విషయంపై ఆసక్తి నెలకొంది. ఎందుకంటే పొంగులేటి ఖమ్మం పర్యటనలో భాగంగా తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నానంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈక్రమంలో టీఆర్ఎస్ నుంచి పిలుపు రావటంతో ఆయనకు రాజ్యసభ సీటు ఇస్తారా? అనే విషయంపై ఉత్కంఠ నెలకొంది.
రాష్ట్రంలో ఖాళీ అయిన రాజ్యసభ సీటు ఇప్పుడు ఖమ్మం జిల్లాలో అసంతృప్త నేతగా ఉన్న పొంగులేటికి దక్కుతుందని జిల్లాలో వినిపిస్తోంది. ఈ మేరకు తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ నుంచి ఫోన్ వచ్చిందనే ప్రచారం సాగుతున్నప్పటికీ ఈ విషయంపై అటు పార్టీ వర్గాలు కానీ, పొంగులేటి కానీ నిర్ధారణ చేయడం లేదు. అయితే ఇప్పటి వరకు పలుమార్లు పొంగులేటికి పదవులు దక్కుతాయని ప్రచారం సాగినప్పటికీ అవి కేవలం ప్రచారం వరకే పరిమితమయ్యాయి.
2014 ఎన్నికల్లో తెలంగాణలో చర్చానీయాంశంగా మారిన పొంగులేటి
2014 ఎన్నికల్లో తెలంగాణలో చర్చానీయాంశంగా మారిన పొంగులేటి ఆ తర్వాత క్రమంగా తన ప్రాభవాన్ని కోల్పోయినట్లు కనిపించారు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత జరిగిన మొదటి ఎన్నికల్లో వెఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలను గెలిపించడంతోపాటు తాను ఎంపీగా గెలిచి తెలంగాణలో సంచలనాలకు కేంద్ర బిందువుగా మారారు. అప్పట్లో వైఎస్సార్‌సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న పొంగులేటి 2012లో పాలేరు ఉప ఎన్నిక సందర్భంగా టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత టీఆర్‌ఎస్ పార్టీలో సైతం తన దైన శైలిలో బలమైన వర్గాన్ని ఉమ్మడి జిల్లాలో ఏర్పాటు చేసుకున్నారు. టీఆర్‌ఎస్‌లో వర్గ విభేదాల కారణంగా 2018లో సొంత పార్టీ నేతల ఓటమికి కారణమయ్యారనే ఆరోపణలు వచ్చిన క్రమంలో 2019లో సిట్టింగ్ ఎంపీ స్థానాన్ని కోల్పోవాల్సి వచ్చింది. అప్పట్నుంచి పొంగులేటి పార్టీ మారుతారనే ప్రచారం సాగినప్పటికీ అధికార టీఆర్‌ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జోరు పెంచిన పొంగులేటి..
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అధికార పార్టీకి ఇప్పుడు రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ కేంద్ర బిందువుగా మారారు. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సైతం పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా లేరు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బలమైన నేతగా ఎదిగిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి తరుచూ జిల్లా పర్యటనలు చేయడంతోపాటు సొంత క్యాడర్‌కు దగ్గరగా ఉంటూ వస్తున్నారు. పార్టీలో ప్రాధాన్యత తగ్గిందనే ప్రచారంతోపాటు ఆయనతోపాటు వెన్నంటి ఉన్న కొందరు కీలక నేతలు మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌కు సన్నిహితంగా మారారు. ఈ నేపథ్యంలో గత ఏడాది రాజ్యసభకు ఎంపిక అవుతాడని ప్రచారం జరిగినప్పటికీ అది కూడా దక్కలేదు. ప్రస్తుతం ఎమ్మెల్యే కోటాలో భర్తీ అవుతున్న ఎమ్మెల్సీ స్థానాల్లో పొంగులేటికి తప్పకుండా అవకాశం దక్కుతుందని ప్రచారం జరిగినప్పటికీ అది కూడా జరగలేదు. ఇప్పటికే ఇద్దరు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారికి అవకాశం కల్పించడంతో ఈ సారి కూడా పొంగులేటికి అవకాశం లబించలేదు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బలమైన నేతగా ఎదిగిన పొంగులేటికి టీఆర్‌ఎస్ పార్టీలో సరైన ప్రాదాన్యత లభించడం లేదని ఆయన అనుచరులు నిరాశకు లోనైనట్లు కనిపిస్తున్నారు.
రాజ్యసభకు పంపకపోతే..? ప్రత్యక్షంగా పోటీ చేస్తారా?
మరో సంవత్సరంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న క్రమంలో సిట్టింగ్ ఎంపీగా ఉండి సీటు రాకపోయినా నాలుగేళ్లపాటు పార్టీలో ఉంటున్న మాజీ ఎంపీ పొంగులేటి ఈ సారి రాజ్యసభకు ఎంపిక కాకపోతే ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే విషయం ఇప్పుడు చర్చానీయాంశంగా మారింది. ఇప్పటికే గత రెండేళ్లుగా పొంగులేటి పార్టీ మార్పుపై సామాజిక మాద్యమాల్లో విస్తృత ప్రచారం సాగుతుంది. అయితే పొంగులేటి మాత్రం ఉమ్మడి జిల్లాలో తన అనుచరులను కాపాడుకుంటూ ఓదార్పు యాత్రలతో ఉమ్మడి జిల్లాను చుట్టేస్తున్నారు. తాజాగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో పొంగులేటి రాజ్యసభ దక్కుతుందా..? ఒకవేళ అది జరగకపోతే ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే అంశం జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది.
- Revanth Reddy : కేసీఆర్ కు రాజకీయ భిక్ష పెట్టింది కాంగ్రెస్ పార్టే : రేవంత్ రెడ్డి
- Rahul Gandhi : టీఆర్ఎస్తో పోరాటమే, పొత్తులుండవు-రాహుల్ గాంధీ
- Rahul Gandhi: ఎన్ఎస్యూఐ నేతలతో రాహుల్ ములాఖత్
- Rahul Gandhi : సోనియా కృషివల్లే తెలంగాణ.. అధికారంలోకి వస్తే హామీలన్నీ నెరవేరుస్తాం : రాహుల్
- Rahul Gandhi : టీఆర్ఎస్తో పొత్తుపై రాహుల్ విసుర్లు.. కాంగ్రెస్ నేతలకు హెచ్చరిక..!
1Tunnel Collapsed : జమ్మూకశ్మీర్ లో కూలిన నిర్మాణంలో ఉన్న టన్నెల్
2Jr.NTR Fans : జూ.ఎన్టీఆర్ ఇంటిముందు అర్ధరాత్రి ఫ్యాన్స్ హంగామా..లాఠీచార్జ్ చేసిన పోలీసులు
3Vikram: హీరో నితిన్ చేతికి కమల్ విక్రమ్ తెలుగు రైట్స్..!
4Exorcism : ప్రాణాల మీదకు తెచ్చిన భూతవైద్యం
5Bigg Boss Nonstop: బిగ్ బాస్ విన్నర్ బిందు.. చరిత్ర సృష్టించబోతున్న ఆడపులి?
6YS Viveka Murder Case: విచారణ ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేం.. హైకోర్టుకు చెప్పిన సీబీఐ!
7CM KCR: నేడు ఢిల్లీకి సీఎం కేసీఆర్.. జాతీయ రాజకీయాల కోసం వరస పర్యటనలు!
8Virat Kohli: సీజన్లో తొలి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అందుకున్న విరాట్ కోహ్లీ
9IPL2022 Gujarat Vs RCB : బెంగళూరు భళా.. కీలక మ్యాచ్‌లో గుజరాత్‌పై విజయం, ఫ్లేఆఫ్స్ ఆశలు సజీవం
10Nikhat Zareen : చరిత్ర సృష్టించిన తెలంగాణ అమ్మాయి.. వరల్డ్ బాక్సింగ్ చాంపియన్‌గా నిఖత్ జరీన్
-
NBK107: అఖండ సెంటిమెంట్‌ను మళ్లీ ఫాలో అవుతున్న బాలయ్య..?
-
Allu Arjun: మహేష్‌కు అట్టర్ ఫ్లాప్ ఇచ్చిన డైరెక్టర్‌తో బన్నీ మూవీ..?
-
F3: ట్రిపుల్ ఫన్ మాత్రమే కాదు.. ట్రిపుల్ రెమ్యునరేషన్ కూడా!
-
NTR30: ధైర్యమే కాదు.. భయం కూడా రావాలి.. పూనకం తెప్పించిన తారక్!
-
Mahesh Babu: మహేష్ సినిమాలో మరో స్టార్ హీరో.. ఎవరంటే?
-
F3: ఎఫ్3 రన్‌టైమ్.. రెండున్నర గంటలు నవ్వులే నవ్వులు!
-
Tamannaah: ఆ ఒక్క సినిమా చేయకుండా ఉండాల్సింది.. తమన్నా షాకింగ్ కామెంట్స్!
-
Cardimom : చర్మసౌందర్యానికి మేలుకలిగించే యాలకుల్లోని యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు!