Warangal Accident : ఆర్టీసీ బస్సు కిందకు దూసుకెళ్లిన కారు

వరంగల్ పట్టణంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన కారు ప్రమాదవశాత్తు బస్సు కిందకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందారు.

Warangal Accident : ఆర్టీసీ బస్సు కిందకు దూసుకెళ్లిన కారు

Warangal Accident (2)

Warangal Accident : వరంగల్ పట్టణంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన కారు ప్రమాదవశాత్తు బస్సు కిందకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకొని కారులోంచి మృతదేహం వెలికితీసి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం కారును బయటకు తీశారు. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం ఆర్టీసీ బస్సు వెనుకబాగంలోకి దూసుకెళ్లింది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది. మృతుడికి సంబంధించిన వివరాలు సైతం తెలియరాలేదు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

చదవండి : Hyderabad Accident : అర్ధరాత్రి ఘట్‍‌కేసర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

ఘట్‌కేసర్ వద్ద జరిగిన కారు ప్రమాదంలో ఓ యువకుడు ప్రాణాలు విడిచారు. చౌదరిగూడ వద్ద వేగంగా వచ్చిన కారు ఫల్టీలు కొట్టింది ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో ముగ్గురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు అధికారులు

చదవండి : Visakha Road Accident: విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి