పశ్చిమగోదావరి జిల్లాలో పోలీసుల ఆంక్షలు భేఖాతరు : కోళ్లకు కత్తులు కట్టిన నిర్వహకులు

పశ్చిమగోదావరి జిల్లాలో కోడి పందాలు నిర్వహకులు, పందెం రాయుళ్లు పోలీసుల ఆంక్షలు భేఖాతరు చేస్తున్నారు. కోళ్లకు కత్తులు కట్టి బరిలోకి దించుతున్నారు.

  • Published By: veegamteam ,Published On : January 14, 2020 / 08:12 AM IST
పశ్చిమగోదావరి జిల్లాలో పోలీసుల ఆంక్షలు భేఖాతరు : కోళ్లకు కత్తులు కట్టిన నిర్వహకులు

పశ్చిమగోదావరి జిల్లాలో కోడి పందాలు నిర్వహకులు, పందెం రాయుళ్లు పోలీసుల ఆంక్షలు భేఖాతరు చేస్తున్నారు. కోళ్లకు కత్తులు కట్టి బరిలోకి దించుతున్నారు.

పశ్చిమగోదావరి జిల్లాలో కోడి పందాలు నిర్వహకులు పోలీసుల ఆంక్షలు భేఖాతరు చేస్తున్నారు. కోళ్లకు కత్తులు కట్టి బరిలోకి దించుతున్నారు. పందెం కోళ్లు బరిలో దిగేందుకు సిద్ధమయ్యాయి. కోళ్లకు కత్తులు కట్టొద్దని పదిహేను రోజులుగా ఫ్లెక్సీలు కట్టి పెద్ద ఎత్తున ప్రచారం చేసినా లాభం లేకుండా పోయింది. జీవ హింస చేయొద్దంటూ ఎక్కడికక్కడ పోస్టర్లు అంటించినా..ఆ పోప్టర్ల ముందే బరులు వెలిశాయి. 

కత్తి కట్టిన కోడి బరిలోకి దూకుతుంది. పందెం రాయుళ్లు లక్షల్లో పందెం కాస్తున్నారు. ఏపీలో కోడి పందాలు జోరుగా సాగుతున్నాయి. ఎమ్మెల్యేలు, మంత్రులే కోడి పందాలు ప్రారంభించడంతో పందెం రాయుళ్లు రెచ్చిపోతున్నారు. కత్తి కట్టి కోళ్ల కొట్లాటను ప్రారంభించారు. భారీగా పందాలు కాసేందుకు పందెం రాయుళ్లు తరలివచ్చారు. 

పశ్చిమ గోదావరిలో కోడిపందాల నిర్వహణ తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. పందాల నిర్వహణ కోసం జిల్లా వ్యాప్తంగా భారీగా బరులు ఏర్పాటయ్యాయి. ఏలూరు సమీపంలోనూ ఇలానే అతిపెద్ద బరిని పందెం రాయుళ్లు ఏర్పాటు చేశారు. అయితే.. కోడిపందాలు నిర్వహించడానికి వీల్లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. బరులు ధ్వంసం చేయడానికి ప్రయత్నించారు. అయితే పందెంరాయుళ్లు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. సంక్రాంతికి పందె నిర్వహించడం తమ సంప్రదాయమంటూ గొడవపడ్డారు. దీంతో.. పోలీసులు వెనుదిరిగారు.