చైనా యాప్స్‌ వెనుక పెద్ద కుట్ర ఉంది, భారత్ ప్రపంచ శక్తిగా ఎదగాలంటే ఇలా చేయాలి, CBI మాజీ JD లక్ష్మీనారాయణ విశ్లేషణ

  • Published By: naveen ,Published On : July 4, 2020 / 09:56 AM IST
చైనా యాప్స్‌ వెనుక పెద్ద కుట్ర ఉంది, భారత్ ప్రపంచ శక్తిగా ఎదగాలంటే ఇలా చేయాలి, CBI మాజీ JD లక్ష్మీనారాయణ విశ్లేషణ

గల్వాన్ ఘర్షణకు భారత్ ప్రతీకారం తీర్చుకుంటోంది. చైనాపై భారత్ డిజిటిల్ స్ట్రయిక్ చేసింది. ఎలాంటి ఆయుధాలు, అణ్వస్త్రాలు ప్రయోగించకుండా ఇది కూడా ఓ యుద్ధం లాంటిదే. చైనా కంపెనీలకు చెందిన ఏకంగా 59 మొబైల్ యాప్స్ పై నిషేధం విధిస్తూ భారత ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. భారత్ దెబ్బకు చైనా విలవిలలాడిపోతోంది. యాప్స్ పై బ్యాన్ విధించడంతో చైనా కంపెనీలు భారీగా నష్టాన్ని చవి చూశాయి. భారత్ నిర్ణయంతో చైనాకు దాదాపు 45వేల కోట్ల నష్టం జరిగిందని స్థానిక మీడియా అంచనా వేసింది.

అలాగే హైవే నిర్మాణ ప్రాజెక్టుల్లో చైనా వాళ్లకు అనుమతులు లేవని కేంద్రం స్పష్టం చేసింది. అలాగే పారిశ్రామిక, రైల్వే, టెలికాం రంగాల్లోనూ చైనా కంపెనీలను బహిష్కరించనున్నారని వార్తలు వస్తున్నాయి. చైనా విద్యుత్ పరికరాలను కూడా ఆపేస్తున్నామని రీసెంట్ గా కేంద్రమంత్రి ప్రకటన చేశారు. వాస్తవానికి ప్రతి ఏటా 21వేల కోట్ల విలువైన దిగుమతలు మనం చైనా నుంచి చేసుకుంటున్నాం. ఇప్పుడు భారత్ తీసుకుంటున్న ఈ నిర్ణయాలు చైనాపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయి? చైనా యాప్స్ పై నిషేధం విధించడం సబబేనా? భారత్ ప్రపంచ శక్తిగా ఎదగాలంటే ఏం చేయాలి? ఈ అంశాలపై సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ టెన్ టీవీ డిబెట్ లో మాట్లాడారు.

యాప్స్ పేరుతో చైనా చేసే కుట్రలు ఇవే:
”1962లో కేవలం సైనిక యుద్ధం మాత్రమే చేశాము. ప్రపంచం గ్లోబల్ విలేజ్ గా మారిపోయింది. 1990 తర్వాత గ్లోబలైజేషన్, లిబరలైజేషన్ జరిగాక ఒక దేశం మీద మరో దేశం అవలంభన ఉండాలనేది ఒక కాన్సెప్ట్ గా మారింది. దాని వల్ల ఇప్పుడు యుద్ధం అనేది ఆయుధాలతోనే కాకుండా అన్ని రకాలుగా ఉంటోంది. మొదటిది సైనిక పరంగా జరిగే యుద్ధం. రెండోది వ్యాపార పరంగా చేసే యుద్ధం. అందులో భాగమే డిజిటల్ స్ట్రైక్. చైనా వాళ్లు ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, ప్రైవసీని అస్సలు పాటించరు. రివర్స్ ఇంజినీరింగ్ లో వాళ్లు చాలా ఎక్స్ పర్ట్స్. ఏదైనా కొత్త వస్తువు తయారైందంటే దాన్ని తెప్పించుకుని దాన్ని పార్టులన్నీ విప్పి దాన్ని వాళ్లు తయారు చేయడం మొదలు పెడతారు. ఇదీ చైనా వాళ్ల లక్షణం.

చైనా కంపెనీలు ప్రైవసీ మెయింటేన్ చెయ్యవు:
డిజిటిల్ లో ఏది చూసినా ప్రైవసీ చాలా ముఖ్యం. ఐఫోన్ అంత ఫేమస్ కావడానికి ప్రైవసీ మెయింటేన్ చేయడమే. కానీ చైనా కంపెనీల తయారు చేసే వస్తువులు, యాప్స్ లో ప్రైవసీ అస్సలు పాటించరు. చైనా వాళ్ల ఉద్దేశం ఏంటంటే, చీప్ గా అప్లికేషన్స్ అందుబాటులోకి తెచ్చి, ప్రజలంతా దాన్ని విపరీతంగా యూజ్ చేయడం మొదలుపెట్టాక వాళ్ల వ్యక్తిగత సమాచారం చోరీ చేస్తారు. దీని ఆధారంగా సైబర్ వార్ కి కూడా రెడీ అవుతారు. దాన్ని తగ్గించడానికే భారత ప్రభుత్వం 59 అప్లికేషన్లపై బ్యాన్ విధించింది. ఇది మంచి నిర్ణయం.

ఇలా చేస్తే ప్రపంచ శక్తిగా భారత్ ఎదగడం ఖాయం:
మన దేశంలో స్టార్టప్స్ లో చైనా పెట్టుబడులు ఎక్కువ. చైనాకు మనం ఎగుమతులు చేసేది తక్కువ, దిగుమతి చేసుకునేది చాలా ఎక్కువ. చైనా యాప్స్ బ్యాన్ చేయడం సబబే. అదే సమయంలో మన మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీని మనం పెంచుకోవాలి. ఇది చాలా ముఖ్యమైన విషయం. స్థానిక రాజకీయ నాయకుల నుంచి తీవ్రమైన ఒత్తిళ్ల కారణంగా పరిశ్రమలు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు సాహసం చెయ్యడం లేదు. ఈ పరిస్థితులు పోవాలి. పరిశ్రమలు పెట్టేవారికి భరోసా ఇవ్వగలగాలి. పరిశ్రమలు పెట్టుందుకు వారికి ఎదురవుతున్న ఇబ్బందులను తొలగించాలి. పారిశ్రామికవేత్తలకు మంచి వాతావరణం కల్పించాలి. మన దేశం ఇంటర్నల్ కెపాసిటీని పెంచుకోవాలి. స్కిల్ డెవలప్ మెంట్ చేసుకోవాలి. ఇవన్నీ పారలల్ గా చేసుకోవాలి. అప్పుడు మన భారత్ కూడా ప్రపంచ దేశాలకు మరీ ముఖ్యంగా చైనాకు ధీటుగా తయారు అవ్వగలదు” అని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ విశ్లేషించారు.

Read:Zoomకు పోటీగా JioMeet వచ్చేసింది.. 24 గంటలు ఫ్రీ మీటింగ్స్ కూడా!