Jubilee Hills : రెస్టారెంట్‌‌ లేడీస్‌ బాత్‌ రూమ్‌లో సీసీ కెమెరా పెట్టిన మైనర్ | CCTV camera in the ladies bathroom of One Drive Restaurant at Jubilee Hills

Jubilee Hills : రెస్టారెంట్‌‌ లేడీస్‌ బాత్‌ రూమ్‌లో సీసీ కెమెరా పెట్టిన మైనర్

జూబ్లీహిల్స్‌లోని వన్‌ డ్రైవ్‌ రెస్టారెంట్‌ లెడీస్‌ బాత్‌రూమ్‌లో సీసీ కెమెరాను యువతి గుర్తించింది. ఈ విషయంపై యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Jubilee Hills : రెస్టారెంట్‌‌ లేడీస్‌ బాత్‌ రూమ్‌లో సీసీ కెమెరా పెట్టిన మైనర్

CCTV camera in ladies bathroom : హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో కలకలం రేపిన లెడీస్‌ బాత్‌రూమ్‌లో సీసీ కెమెరా వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. జూబ్లీహిల్స్‌లోని వన్‌ డ్రైవ్‌ రెస్టారెంట్‌ లెడీస్‌ బాత్‌రూమ్‌లో సీసీ కెమెరాను ఓ యువతి గుర్తించింది. వెంటనే యువతి ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ఇప్పటికే వన్‌ డ్రైవ్‌ రెస్టారెంట్ యజమాని చైతన్య, ఇద్దరు సిబ్బందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అసలు బాత్‌ రూమ్‌లో సీసీ కెమెరా ఎవరు పెట్టారు? ఎన్ని రోజుల నుంచి కెమెరా అక్కడ ఉంది? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

Suicide : భర్త కళ్లెదుటే ఉరేసుకుని భార్య ఆత్మహత్య

జూబ్లీహిల్స్ వన్ డ్రైవ్ రెస్టారెంట్ బాత్రూంలో స్పై కెమెరా ఉదంతంలో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిన్న వెలుగులోకి వచ్చిన ఈ కేసుకు సంబంధించి రెస్టారెంట్‌లో పనిచేస్తున్న బెనర్జీ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. బెనర్జీ రెస్టారెంట్‌లో హౌస్‌కీపర్‌గా పనిచేస్తున్నాడు. హౌస్‌కీపర్‌ బెనర్జీ మైనర్ కావడం గమనార్హం. అతనే స్పై క్యామ్ పెట్టినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. స్వాధీనం చేసుకున్న స్పై క్యామ్ లో ఐదు గంటల డేటా ఉంది.

స్పై క్యామ్‌ విషయంలో హౌస్‌కీపర్‌ని అరెస్ట్ చేసినా.. రెస్టారెంట్‌లో అసలు సీసీ కెమెరా బ్యాకప్‌ అందుబాటులో లేకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. వన్ డ్రైవ్ ఓనర్ చైతన్య పాత్రపైన కూడా చాలా డౌట్స్ ఉన్నాయి. అందుకే హౌస్ కీపర్ బెనర్జీ ఇంటితో పాటు ఓనర్ చైతన్య నివాసంలోనూ పోలీసులు తనిఖీలు చేశారు.

హౌస్ కీపర్ బెనర్జీ సీక్రెట్ కెమెరా అమర్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కొంతమంది యువతుల నగ్న దృశ్యాలు సీక్రెట్ కెమెరాలో రికార్డు అయినట్లు పోలీసులు కనుగొన్నారు. ప్రస్తుతం బెనర్జీ, చైతన్యను పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. బెనర్జీపై నిర్భయ కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు.

 

×