COVID-19: కరోనా బారిన సెలబ్రిటీలు.. మరోసారి విజృంభణకు సూచన?

రోజుకు వేలల్లో పెరుగుతున్న కరోనా కేసులతో హాస్పిటల్స్ సరిపోని దుస్థితి. అంబులెన్స్ ల్లో ఉండే ట్రీట్మెంట్ తీసుకున్న రోగులను దాటి ఆక్సిజన్ సదుపాయం అందక ప్రాణాలు కోల్పోయిన బాధితులు...

COVID-19: కరోనా బారిన సెలబ్రిటీలు.. మరోసారి విజృంభణకు సూచన?

Covid 19

COVID-19: రోజుకు వేలల్లో పెరుగుతున్న కరోనా కేసులతో హాస్పిటల్స్ సరిపోని దుస్థితి. అంబులెన్స్ ల్లో ఉండే ట్రీట్మెంట్ తీసుకున్న రోగులను దాటి ఆక్సిజన్ సదుపాయం అందక ప్రాణాలు కోల్పోయిన బాధితులు ఉన్నారు. అలాంటి దుస్థితి నుంచి ఇమ్యూనిటీ పెంచే కొవిడ్ వ్యాక్సిన్ కాస్త ఊరట కలిగించింది. మాస్క్, శానిటైజర్లతో ఎలా అయితే బయటపడ్డాం.. మరి ఇప్పుడు మరోసారి తెలుగు రాష్ట్రాల సెలబ్రిటీల్లో కనిపిస్తున్న కరోనా కేసులు మరోసారి విజృంభణకు తార్కాణంగా మారాయా..

ఏపీ గవర్నర్, కమలహాసన్, శివశంకర్ మాస్టర్, పోచారం శ్రీనివాస రెడ్డి లాంటి ప్రముఖులకు కొవిడ్ పాజిటివ్ వచ్చినట్లు తేలింది. మహమ్మారి ఆరంభ రోజుల్లో ఒకరిద్దరికీ వస్తేనే సెన్సేషన్. ఇప్పుడు సెలబ్రిటీలకు పాజిటివ్ వస్తేనే ప్రత్యేకంగా చెప్పుకుంటున్నారు. చాప కింద నీరులా కొవిడ్ ప్రచారంలో మాత్రమే లేకుండా ఇప్పటికే వందల మందిలోకి చొచ్చుకుపోతుందా.. ప్రతి ఒక్కరిలో మెదిలే సందేహమే ఇది.

యూరప్ దేశాల్లో తారాస్థాయికి చేరుకున్న కరోనా ఆందోళనలో ముంచెత్తుతుంది. మరికొద్ది రోజుల్లో 7లక్షలకు పైగా మరణాలు నమోదవుతాయని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెచ్చరికలు జారీ చేసింది.

…………………………………….: ఇంటి చివరి కెప్టెన్‌గా షణ్ముక్.. పక్కా ప్లాన్ వేసి మరీ!

కొవిడ్ వల్ల ఏర్పడిన లాక్ డౌన్ నుంచి ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు తప్పని పరిస్థితుల్లో ఇళ్లలో నుంచి బయటపడ్డాం. మాస్క్, శానిటైజర్ లాంటి ఆయుధాలతో పోరాడుతూ మనుగడ సాగిస్తున్నాం. ఇటువంటి సమయాల్లో ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా ప్రమాదం తప్పదని హెచ్చరిస్తున్నారు నిపుణులు. మరికొందరు కొవిడ్ వ్యాక్సిన్ ఒక డోసు మాత్రమే తీసుకుని రెండో డోసు నిర్లక్ష్య పెట్టేస్తున్నారు.

ప్రపంచవ్యాప్తంగా బూస్టర్ డోస్ పై చర్చలు జరుగుతున్న తరుణంలో ఒక డోసుతోనే సరిపెట్టుకుంటే ఇమ్యూనిటీ సరిపోదని కొందరి భావన. యథావిధిగా పనులు జరగాల్సిన పరిస్థితి రావడం, ఒక టీం మొత్తంలో ఏ ఒక్కరు నిర్లక్ష్యం వహించినా ముప్పు తప్పదు.

……………………………….. : పెళ్లయ్యాక పాత ప్రియుడితో ప్రేమ.. ట్రైలర్ అదిరింది..