MLC Kavitha: వైఫల్యాలను ఎత్తి చూపిన వారిపై కేంద్రం దాడులు: ఎమ్మెల్సీ కవిత

ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాల్ని కేంద్రం కూలుస్తోందని విమర్శించారు తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. తెలంగాణ జాగృతి సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో సోమవారం జరిగిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.

MLC Kavitha: వైఫల్యాలను ఎత్తి చూపిన వారిపై కేంద్రం దాడులు: ఎమ్మెల్సీ కవిత

MLC Kavitha: వైఫల్యాలను ఎత్తి చూపిన వారిపై కేంద్రం దాడులకు పాల్పడుతోందని విమర్శించారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాల్ని బీజేపీ కూలుస్తోందన్నారు. తెలంగాణ జాగృతి సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో సోమవారం జరిగిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.

Rs 2000 Notes: మూడేళ్లక్రితమే ఆగిపోయిన రూ.2000 నోట్ల ప్రింటింగ్.. దశలవారీగా నోట్ల రద్దు: బీజేపీ ఎంపీ వెల్లడి

ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ‘‘దేశంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాల్ని బీజేపీ కూల్చేస్తోంది. ఇప్పటివరకు మొత్తం ఎనిమిది రాష్ట్రాల ప్రభుత్వాల్ని బీజేపీ కూల్చేసింది. రూపాయి విలువ తగ్గడంతోపాలు దేశంలో అనేక రంగాలు తిరోగమనంలో పయనిస్తున్నాయి. తెలంగాణ ఆడబిడ్డల కళ్లలోంచి నీళ్లు రావు. నిప్పులే వస్తాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడితే వాళ్లపై సీబీఐతో దాడులు చేయిస్తోంది. దేశవ్యాప్తంగా సీబీఐ దాడులు జరుగుతున్నాయి. నాపై కూడా దాడి జరిగింది. అయినా, సీబీఐ దాడులకు భయపడేది లేదు. గొంతెత్తే ప్రతిపక్ష నేతలకు సంబంధించి, లేనిపోని లీకులిచ్చి వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థల్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది. ఫోర్త్ ఎస్టేట్ ప్రైవేట్ ఎస్టేట్‌గా మారింది.

అందరూ దేశం గురించి ఆలోచించాల్సిన సందర్భం వచ్చింది. తెలంగాణ జాగృతి తరఫున దేశమంతా తిరగాలి. ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. ఈ సంస్థ తరఫున ప్రతి గ్రామానికి వెళ్లి ప్రజల్ని జాగృతం చేయాలి. కవులు, రచయతలు, కళాకారులు ఏకం కావాల్సిన అవసరం ఉంది. తెలంగాణ తరహా ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా తీసుకొస్తాం’’ అని కవిత వ్యాఖ్యానించారు.